CM KCR: వీడిన సస్పెన్స్.. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ముహూర్తం ప్రకారమే!

CM KCR: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై అనేక రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ప్రకటించబోతున్నానంటూ గత రెండు, మూడు నెలలుగా కేసీఆర్ చెబుతూనే ఉన్నారు. బహిరంగ సభల్లో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ అవసరమని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. థర్డ్ ఫ్రంట్ అవసరమని సూచించారు. అందరితో చర్చించిన అనంతరం కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు. దేశంలో రైతు సమస్యలు ఎక్కువగా ఉండటంతో రైతు ఎజెండగానే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో నేతలతో చర్చించారు.

అయితే మూడు నెలలుగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ గురించి చెబుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నా.. ప్రతిసారి వెనక్కి వెళ్లిపోతుంది. ఇటీవల దసరాకు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని, హైదరాబాద్ వైదికగా పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల మళ్లీ దసరాకు ప్రకటించరని, మునుగోడు ఎన్నికల తర్వాత ప్రకటిస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో దసరాకు కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో ఎట్టకేలకు కొత్త జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. విజయదశమి రోజున అక్టోబర్ 5న కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. తెలంగాణభవన్ లో కొత్త జాతీయ పార్టీపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్ జాతకాలను, పంచాంగాలను, ముహూర్తాలను బాగా విశ్వసిస్తారు. అందుకే పండితులు నిర్ణయించిన శుభముహూర్తమైన 1.19 గంటలకు కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

తెలంగాణలో భవన్ అక్టోబర్ 5న టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంతో పాటు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముందుగా నేతలతో కొత్త జాతీయ పార్టీ గురించి చర్చించనున్నారు. నేతలకు కొత్త జాతీయ పార్టీ గురించి వివరించనున్నారు. ఆ తర్వాత నేతల ఆమోదం తర్వాత కేసీఆర్ అధికారికంగా కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరు ప్రకటించే అవకాశముంది. భారతీయ రాష్ట్ర సమితి లేదా భారతీయ రైతు సమితి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలోనే కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఉండే అవకాశముంది.

మునుగోడు ఎన్నికల తర్వాత కొత్త జాతీయ పార్టీని ప్రకటించారని కేసీఆర్ ముందుగా భావించారట. కానీ దసరా మంచిరోజు కావడం, ఆ రోజు మంచిదని పండితులు కూడా సూచించడంతో ఆ రోజే కొత్త పార్టీ ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పుడు పార్టీ పేరును మాత్రమే ప్రకటిస్తారని, మునుగోడు ఉపఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో కొత్త జాతీయ పార్టీపై దృష్టి పెడతారనే ప్రచారం సాగుతోంది. జెండా, గుర్తు వంటి వాటిని తర్వాత ప్రకటించనున్నారు. ఈసీ నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత మిగతా వివరాలను వెల్లడించనున్నారు. అక్టోబర్ 5న కొత్త పార్టీ పేరు మాత్రమే ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. గత కొద్దిరోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్.. కొత్త జాతీయ పార్టీపై నేతలతో చర్చలు జరుుతున్నారు. విధివిధానాల గురించి చర్చిస్తున్నారు. రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -