CM KCR: బీఆర్ఎస్ తొలి పోరాటం దానిపైనే.. టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్

CM KCR: బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీకి తీర్దిదిద్దేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తోన్నారు. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని భావిస్తున్నారు. పునాదులు బలంగా వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దేశ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కసరత్తలు చేస్తోన్నారు సీఎం కేసీఆర్. దాని కోసం మోదీ ప్రభుత్వ వైఫల్యాలను పాటు రాజ్యాంగ వ్యవస్థలను, ఇండిపెండెంట్ సంస్థలను కేంద్రం నిర్విర్యం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్వతంత్ర సంస్థలను తమ కనుసన్నల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను ఇబ్బంటి పెట్టే విధంగా మోదీ ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దీనపై గట్టిగా పోరాంటం చేయాలని కేసీఆర్ బావిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వారా కేంద్ర వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడంపై కేసీఆర్ పోరాడుతారని, తొలి టార్గెట్ ఇదననే వార్తలు వినిపిస్తున్నాయి. తొలి యాక్షన్ ను ప్లాన్ ను దీనిని ఎంచుకోవడం కారణంగా మునుగోడు ఉపఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు ఈసీ ఇచ్చిన షాక్ అని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ కేటాయించడంపై టీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. హైకోర్టును సైతం దీనిపై టీఆర్ఎస్ ఆశ్రయించింది.

కానీ హైకోర్టును దీనిపై టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కారును పోలిన రోడ్ రోలర్ తో పాటు ట్రాక్టర్ తో పాటు ఇతర గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఈసీని టీఆర్ఎస్ కోరింది. కానీ టీఆర్ఎస్ విన్నపాలను ఈసీ పట్టించుకోలేదు. తాను ఆ గుర్తులను చాలా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించామని, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా కేటాయించామని ఈసీ చెబుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ఫ్రీ గుర్తులుగా వాటిని గుర్తించింది. కానీ గతంలో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించమని ఈసీ హామీ ఇచ్చిందని టీఆఆర్ఎస్ చెబుతోంది. అయితే ఆ హామీని పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ నేతల ప్రోదబ్బలంతో ఈసీ తమను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఇక ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించి మునుగోడులో ఈసీ బ్రేక్ వేసింది. ఈ సారి గొర్రెల పంపిణీ కాకుండా ఆ పథకం లబ్దిదారులు నగదు రూపంలో జమ చేయాలని ప్రబుత్వం నిర్ణయించింది. కానీ దీనిపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో గొర్రెల పథకం డబ్బులను జమ చేయడం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమేనని తెలిపింది. బీజేపీ చప్పినట్లు ఈసీ చేస్తోందని, తమను ఇరుకున పెట్టేలా చూస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. క్రమంలో బీఆర్ఎస్ తొలి టార్గెట్ ఈసీపైనే పోరాటం అని చెబుతున్నారు. ఈసీ వ్యవహారిస్తున్న తీరును దేశ ప్రజల ముందు ఉంచి ఎండగట్టేలా ప్రయత్నాలు చేయను్నారు.

ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా పార్టీలు ఈసీ తీరును తప్పుబడుతున్నాయి. దీంతో ఆ పార్టీలన్నింటినీ కలుపుకుని ఈసీ తీరుపై కేసీఆర్ పోరాటం చేయనున్నారని చెబుతున్నారు. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి ఈసీప పోరాటం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించని ఈసీ.. ఒక్క హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది.

దీనిపై దేశవ్యాప్తంగా ఈసీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్పినట్లే ఈసీ చేస్తోందనే ఆరోపణలు వినపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ప్రకటించకుండా.. గుజరాత్ ఎన్నికలను తర్వాత నిర్వహించనుండంటపై విమర్శలు వస్తున్నాయి. ఈసీని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ తొలి టార్గెట్ ఈసీపై పోరాటమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Jagan: పిల్లి పిల్లలను తిప్పిన్నట్లు సచివాలయ ఉద్యోగులను తిప్పుతున్న జగన్ సర్కార్.. ఏమైందంటే?

Jagan: పిల్లి తన పిల్లలను రక్షించుకోవడం కోసం ఒక చోటే ఉంచకుండా అన్ని చోట్లకు మారుస్తూ ఉంటుందట అలా ఉంది ప్రస్తుతం ఏపీ అధికార ప్రభుత్వం పనితీరు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...
- Advertisement -
- Advertisement -