Roja: జబర్దస్త్ షో రోజా కెరీర్ కు శాపంగా మారిందా.. ఏం జరిగిందంటే?

Roja: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి అందాల తార రోజా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజా. ఇక తన చక్కటి నవ్వు, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక రోజా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎమ్మెల్యేగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సేవలు అందించింది. ఇక జబర్దస్త్ బుల్లితెరపై కొంతకాలం వరకు హడావిడి చేసింది రోజా. నిజానికి చెప్పాలంటే సినిమాల పరంగా వచ్చిన క్రేజ్ కి సమానంగా రోజా జబర్దస్త్ లో సంపాదించుకుంది. అలా జబర్దస్త్ షో లో మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రోజా ఇటీవల మంత్రి పదవి బాధ్యతను చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రోజాను మంత్రిగా నిశ్చయించారు. దాంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పిన రోజా పూర్తిగా రాజకీయాల్లో పడిపోయింది. కాగా మంత్రి పదవి చేపట్టగానే రోజా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రోజాకు దసరా సందర్భంగా జబర్దస్త్ ఈవెంట్లో ఆహ్వానం వచ్చింది. అంత పాపులారిటీ సంపాదించి పెట్టిన ఈ షో పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటుంది.

వెంటనే వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు రోజా మంత్రి పదవి కి ఎసరు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ షో ప్రసారమయ్యేది జగన్ నిత్యం ఆగ్రహంతో ఉండే ఆ వ్యక్తి ఛానల్ అట. కనుక రోజా ఆ షో కు చెప్పా పెట్టకుండా వెళ్ళిందని కొంతమంది జగన్ కు ఫిర్యాదు చేశారట. ఇక జగన్ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దాంతో ఈ విషయం తెలిసిన కొందరు జబర్దస్త్ షో రోజాకు శాపం గా మారిందని అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -