Cobra Movie Review: కోబ్రా సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది: ఆగస్ట్‌ 31,2022
నటీనటులు: చియాన్ విక్రమ్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి
నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాత: ఎన్వీ ప్రసాద్
దర్శకత్వం: అజయ్
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: భువన్ శ్రీనివాసన్
ఎడిటర్‌: భువన్ శ్రీనివాసన్

Cobra Movie Review and Rating

విక్రమ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అపరిచితుడు సినిమాతో విక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్ట లేకపోయాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విక్రమ్‌కు మహాన్ కాస్త ఊపిరినిచ్చినట్టు అయింది. ఇక ఇప్పుడు కోబ్రా అనే చిత్రంలో థియేటర్లలో సందడి చేసేందుకు విక్రమ్ వచ్చాడు. నేడు కోబ్రా మూవీ విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ: లెక్కల మాస్టారైన కోబ్రా (విక్రమ్‌).. తనకు ఎదురైన ప్రతీ సవాల్‌ను మ్యాథ్స్‌తోనే పరిష్కరిస్తుంటాడు. అలాంటి కోబ్రా జీవితంలోకి సమస్యలు ఎలా వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయ్? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఇందులో క్రికెట్ ఇర్ఫాన్ పటాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా పని చేశాడు. ఇతని వల్ల కోబ్రాకు ఎదురైన సమస్యలేంటి?.. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్లి పాత్రలకు కోబ్రాతో ఉన్న రిలేషన్ ఏంటి?.. అసలు కోబ్రా వివిధ రూపాలను మార్చుకోవడం వెనుకున్న కథ ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: విక్రమ్ నటన గురించి అందరికీ తెలిసిందే. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. పాత్ర కోసం ఒళ్లు హూనం చేసుకుంటాడు. ఎంతో కష్టపడుతుంటాడు. ఈ చిత్రంలోనూ ప్రతీ గెటప్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. కోబ్రాగా విక్రమ్ అద్భుతంగా నటించేశాడు. ప్రతీ గెటప్‌లోనూ వేరియేషన్ చూపించాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ తెరకు కొత్తే అయినా చక్కగా నటించాడు. శ్రీనిధి శెట్టికే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. మృణాళిని, మీనాక్షిలు పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో అంతా తమిళ వారే కనిపిస్తుంటారు.

విశ్లేషణ: డైరెక్టర్ అజయ్ ఓ కొత్త పాయింట్ ఎత్తుకున్నాడు. లెక్కలతో చిక్కు ముడి విప్పడం, మ్యాథ్స్‌తో తనకు ఎదరయ్యే సవాళ్లను పరిష్కరించడం అనే కొత్త కాన్సెప్ట్‌తో కోబ్రాను మలిచారు. అది అందరికీ కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ, కథనం అద్భుతంగా సాగింది. ఇక ఇందులో విక్రమ్ నటన ప్లస్సుగా నిలిచింది. హీరోయిన్ విలన్‌ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎంగేజింగ్‌గా అనిపించాయి.

కోబ్రా సినిమాకు వెన్నుముకలా నిలిచాయి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. ఏఆర్ తన బీజీఎంతో అందరినీ మెస్మరైజ్ చేసేశాడు. భువన్ కెమెరాపనితనం వేరే ప్రపంచానికి తీసికెళ్లినట్టు ఉంది. మొత్తానికి సాంకేతికంగా ఈ చిత్రం ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. అయితే మాటలు అంతగా పేలలేదు. పాటలు అంతగా గుర్తుండకపోవచ్చు.

విక్రమ్ తన నటనతో అయితే అందరినీ మెప్పించేస్తాడు. చాలా రోజుల తరువాత వింటేజ్ విక్రమ్‌ను చూసినట్టు అనిపిస్తుంది. కోబ్రా మాత్రం అలా పాక్కుంటూ వెళ్లి.. బాక్సాఫీస్ వద్ద మంట పెట్టేలానే కనిపిస్తోంది. విక్రమ్ పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కేట్టు కనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్…

విక్రమ్
కథ
డైరెక్షన్
సంగీతం, ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్…

అక్కడక్కడా నెమ్మదించే కథనం

రేటింగ్: 2.75/5

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -