Lakshmipathy: కమెడియన్ లక్ష్మీపతి కుటుంబంలో ఆర్థిక కష్టాలు

Lakshmipathy: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్లతో పాటు కెమెడియన్లకు కూడా ప్రత్యేక పాత్ర ఉంది. సినిమా పండాలంటే అందులో కామెడీ కోణం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడైతే కామెడీ అంతగా సాగడం లేదుగానీ అప్పట్లో ప్రతి సినిమాకు కామెడీనే ప్లస్ అని చెప్పేవారు. అందుకే అప్పటి కమెడియన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అలా కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో లక్ష్మీపతి కూడా ఉన్నారు. ఆయన కాలం చేసి చాలా రోజులైంది. ఆయన లేకపోయినా ఇప్పుడు ఆయన పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి.

 

‘వర్షం’ సినిమా డైరెక్టర్ శోభన్ కి లక్ష్మీపతి స్వయంగా అన్నయ్య అవుతారు. శోభన్ చనిపోయిన కొంతకాలానికే లక్ష్మీపతి కూడా మరణించారు. తాజాగా లక్ష్మీపతి కూతురు శ్వేత తన తండ్రితో తనకి గల అనుబంధాన్ని ‘పోస్టు చేయని ఉత్తరాలు’ అనే పుస్తకం ద్వారా ప్రచురించారు. తాజాగా ఆమె ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అందులో ఆయన గురించి చాలా విషయాలు తెలిపారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్వేత పలు విషయాలను వెల్లడించారు. మొదటి నుంచి తనకు రాయడం అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం నుంచే పోస్టు చేయని ఉత్తరాలు అనే పుస్తకం పుట్టిందని తెలిపింది. తన బాబాయ్ మహేశ్ బాబుతో ‘బాబీ’ అనే సినిమా తీశారని, ఆ సినిమా క్లైమాక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం వల్ల అది విజయవంతం కాలేదని, అందువల్ల ఆ సినిమాతో లాస్ వచ్చిందని తెలిపింది. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ బాబాయ్ కెరియర్ పై కూడా పడిందని, దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని ఆమె తెలిపారు.

 

బాబీ సినిమా డిజాస్టర్ తర్వాత తమకున్న థియేటర్లతో పాటుగా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో బాబాయ్ తీసిన వర్షం సినిమా తీశారని, అది ఎంతో ఘన విజయం సాధించిందని అన్నారు. అయితే ఆ తర్వాత రవితేజతో చేసిన ‘చంటి’ సినిమా అంతగా ఆడలేదని, ఆ తర్వాత వచ్చిన ‘ఆంధ్రుడు’, ‘పెదబాబు’ సినిమాలు బాగా ఆడాయని శ్వేత తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -