Prudhvi Raj: బాలకృష్ణను తెగ పొగిడేసిన పృథ్వీరాజ్..

Prudhvi Raj: బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చరగని ముద్ర వేసుకున్నాడు. నటనపరంగా తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు బాలకృష్ణ. ఇక బాలయ్య ప్రత్యేకమైన మేనరిజానికి కుర్ర కారు ఒక రేంజ్ లో ఊగిపోతుంది.

మొత్తానికి బాలకృష్ణ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవలే విడుదలైన అఖండ సినిమాతో బాలయ్య ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. బి టౌన్ ప్రేక్షకులను సైతం బాలయ్య నటనకు ఫిదా అయ్యారు. ఈ విధంగా బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే నటుడు పృథ్వీరాజ్ బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్.. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ తనతో కలిసి నటించిన సినిమాలు గురించి తెలిపాడు. అంతేకాకుండా నటన పరంగా.. వ్యక్తిగతంగా బాలయ్య మంచితనాన్ని వివరించాడు. అంతేకాకుండా బాలకృష్ణ సామాన్య ప్రజలతో కూడా ఎలా ఉంటాడో.. పృధ్వీరాజ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాకుండా చివరిగా పృథ్వీరాజ్.. బాలకృష్ణ నిజంగా కారణజన్ముడు అని పొగిడేసాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు.. మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వేయండి. ఇక బాలకృష్ణ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఎన్.బి.కే 107 అనే సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతుంది.

అంతేకాకుండా ఎన్ బి.కే 108 అనే ప్రాజెక్టు కూడా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక బాలయ్య ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -