Pawan Kalyan: కావాలనే పవన్‌ కళ్యాణ్‌పై కేసు.. కక్షతో కళ్లు మూసుకుపోయి..?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారట. దీంతో పోలీసులను ప్రజలు మరింత చులకనగా చూస్తున్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రాథమిక వివరాలు కూడా లేవు. ఫిర్యాదుదారుడు శివకుమార్ వివరాలు, కేసు ఎందుకు పెట్టారో తెలియదు. ఫిర్యాదు ఎందుకు చేశాడో తెలియదు. శివకుమార్ ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు. అసలు ఫిర్యాదులో యాక్సిడెంట్ చేసినట్లు వివరాలు లేవు. తనకు తానే కింద పడ్డానని ఉంది. ఈ ఎఫ్ఐఆర్ వివరాలు బయటపడటంతో మీడియా వర్గాలు కూడా నవ్వుకుంటున్నారు. ఇంత సిల్లీగా పోలీసులు కేసు ఎలా నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. కక్షతో కళ్లు మూసుకుని కొందరు ఏదో చేద్దామని నవ్వుల పాలైనట్లు తెలుస్తోంది.

 

పోలీసులకు కూడా తాము చేసిన తప్పేంటో అర్థమైనట్లు ఉంది. దీంతో పోలీసులు శివకుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా పోలీసులు ఏదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం అందిస్తారు. కానీ పవన్ కళ్యాణ్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలను బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ రెండు రోజుల తర్వాత లీకైంది. దాంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరి తన ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ.. అసలు కనిపించడం లేదు. దీంతో పోలీసులు శివను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

రాజకీయ కోణంలోనే పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైందని పలువురు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడం వల్లే కారుపై ఎక్కాడని, అప్పుడు పవన్ అభిమానులకు అభివాదం చేస్తూ.. ఇప్పటం వరకు ప్రయాణించారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్‌పై ఆలస్యంగా కేసు నమోదు కావడం, రెండు రోజులు ఆలస్యంగా వివరాలు వెల్లడించడంపై రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. పవన్‌ను అధికార పార్టీ ఏం చేయలేకపోయినా.. పోలీసుల్నీ మాత్రం నవ్వుల పాలు చేసింది.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -