Renuka Chowdhury: కొడాలి నానిపై రేణుకా చౌదరి పోటీ? గుడివాడలో పోటీకి సై!

Renuka Chowdhury: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రేణుకా చౌదరి పేరు తెలియనివారు చాలా తక్కువ మంది ఉంటారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఆమె ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో కూడా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఖమ్మం నుంచి పలుమార్లు ఎంపీగా ఆమె గెలిచారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంలో ఆమె బాగా పాపులర్. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఆమెకు పేరుంది.

తన విమర్శలతో బలమైన వాయిస్ ను ఆమె వినిపిస్తారు. ఎవరినైనా సరే ఎదురిస్తారు. తన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఎవరికీ భయపడని మనస్తత్వం ఆమెది. రాజకీయాల్లో అసలు ఎవరికీ ఆమె భయపడరు. ఏది అనుకుంటే అది చేస్తారు. ఎవరిపై అయినా విమర్శల దాడి చేస్తూ హీట్ పెంచేస్తారు. అయితే గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమె భావించినా.. టికెట్ దక్కలేదు. టీడీపీతో పొత్తులో భాగంగా ఆమె స్థానంలో వేరేవారికి టికెట్ దక్కింది. దీంతో గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ బరిలో ఆమె దిగలేదు.

అయితే ఈ సారి ఏకంగా ఏపీ రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆమె.. సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ పాలనపై దుమ్మెత్తిపోశారు. రైతుల ఉసురు జగన్ కు తగులుతుందని వ్యాఖ్యానించారు. అలాగే కొడాని నాని బూతులపై కూడా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో కొడాలి నాని ఏపీ అసెంబ్లీ రేణుక చౌదరి పేరు తీసుకొచ్చారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలువలేని రౌణుకా చౌదరి ఏపీకి వచ్చి జగన్ ను విమర్శిస్తున్నారంటూ కొడాలి నాని అసెంబ్లీలో ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు. తన ముందు కొడాలి నాని ఓ బచ్చా అని అన్నారు. కొడాలి నాని లారీ క్లీనర్ గా పనిచేసే సమయంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాజ్యసభ, కేంద్రమంత్రి పదవులను అనుభవించానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున గుడివాడ నుంచి పోటీ చేస్తానని, ఏదైనా జరగొచ్చని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఏపీలోకి కూడా నాకు ఫాలోయింగ్ ఉందని, గుడివాడ నుంచి గెలవడం పెద్ద విషయమేమీ కాదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.

దీంతో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. గుడివాడ నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించడం కలకలం రేపుతోంది. గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆమెకు ఉన్న ఆదరణ, గతంలో టీడీపీలో పనిచేయడంతో ప్రతిపక్ష టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుడివాడలో కొడాలి నానికి పోటీగా బలమైన అభ్యర్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారు. ఎవరిని పోటీలోిక దింపాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. దీంతో రేణుకా చౌదరి టీడీపీ తరపున పోటీ చేస్తారా.. లేదా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్న కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Prabhas-Sreeleela: ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమేనా?

Prabhas-Sreeleela:  పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నటి శ్రీ లీల. ఇలా మొదటి సినిమాతోనే తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె అనంతరం రవితేజ...
- Advertisement -
- Advertisement -