BJP-YSRCP: బీజేపీ, వైసీపీ మధ్య ప్రేమ కొనసాగుతోందా.. బీజేపీ వెన్నుపోటు వెనుక కారణాలివేనా?

BJP-YSRCP: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోని ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే మాత్రం కాస్త విచిత్రంగానే ఉన్నాయని చెప్పాలి. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉంది అంటే మనసు ఒకచోట మనవు ఒకచోట అనేలాగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి తెలుగుదేశం జనసేనతో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ వైసీపీకే అనుకూలంగా ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం జగన్ చెప్పినట్టు కేంద్రం వింటుందని అందరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా సందేహాలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడగింపు విషయంలోనైతేనేమి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వంటివి చూస్తే బీజేపీ మద్దతు వైసీపీకే ఉందని తెలుస్తోంది.

సాధారణంగా ఎన్నికల సమయంలో ఇన్ చార్జ్ ల స్థానంలో పూర్తి స్థాయి అధికారులను నియమించడం గమనార్హం . అలాగే డెప్యూటేషన్ మీద ఉన్న అధికారులను కూడా మార్చేస్తారు. ఏమిటో మరి ఏపీ స్పెషల్. ఇక్కడ అలా జరగడం లేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమినేతలు ఫిర్యాదు చేసిన కూడా కేంద్రం పట్టించుకోలేదు అలాగే ఈసీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.

ఈ విధంగా ఈసీ వ్యవహార శైలి అలాగే కేంద్రం వ్యవహార శైలి కనుక చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు కూటమిలో భాగంగా బీజేపీ అత్యధిక సీట్లను తీసుకొని పరోక్షంగా జనసేన తెలుగుదేశం నేతలకు ఒక రకంగా హాని చేస్తూనే వైసిపికి మద్దతు తెలుపుతోందా అన్న సందేహాలు కూడా అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -