Chiranjeevi: చిరంజీవి పెళ్లి విషయంలో కుట్ర.. సురేఖ ఏ మందు కలిపిందో అంటూ?

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే తాజగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి తన పెళ్లి విషయం లో జరిగిన కుట్ర గురించి బయట పెట్టాడు.

అదేమిటంటే చిరంజీవికి పెళ్లికాకముందు సినిమా అవకాశాలు అప్పుడే పుంజుకున్నాయి. ఆ సమయంలోనే అల్లు రామలింగయ్య గారు చిరుకి పరిచయమయ్యారు. ఇక రామలింగయ్య గారు చిరు వ్యక్తిత్వాన్ని దూరంగా ఉండి పసిగట్టేసాడు అట. అలా రామలింగయ్య గారు చిరు వ్యక్తిత్వానికి ఫిదా అయ్యి..ఆ తర్వాత చిరంజీవి తండ్రి దగ్గరికి వెళ్లి అయన పెళ్లి విషయంలో నా గురించి మాయమాటలు చెప్పి మా నాన్న ను పెళ్లికి ఒప్పించారని చిరంజీవి ఫన్నీగా తెలిపాడు.

ఇక అప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని..తెలిపాడు చిరు. కానీ పెళ్లికూతురు సురేఖ ఫోటో చూడగానే కొంచెం ఓకే చెప్పాలని అనిపించిందని అయినా కానీ పెళ్లి విషయలో ఉగ్గ పట్టుకున్నాను అని చిరంజీవి ఫన్నీగా తెలిపాడు. ఆ తర్వాత రామలింగయ్య గారు చిరంజీవిని తన ఇంటికి పిలిచారట. ఇక చిరంజీవి వెళ్ళగా తన కూతురు సురేఖతో కాఫీ పెట్టించారట రామలింగయ్య గారు.

మరి ఆ కాఫీలో సురేఖ ఏం మత్తు మందు కలిపిందో కానీ నేను సురేఖ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోక తప్పలేదు అంటూ చిరంజీవి ఎంతో కామెడీ పండించాడు. స్టేజి మీద చిరంజీవి ప్రసంగాన్ని వింటున్న అల్లు అర్జున్, అల్లు అరవింద్ లు ఒక్కసారిగా నవ్వేసారు. ఆ క్రమంలోనే చిరంజీవి అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నాకు దొరకటం ఒక గొప్ప వరం లా భావిస్తున్నాను అని అయన తెలిపాడు. ప్రస్తుతం చిరంజీవి ఫన్నీగా బయటపెట్టిన తన పెళ్లి రహస్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -