Punjab Governor: దేశంలో గవర్నర్ వ్యవస్ధపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. రాజ్యాంగపరంగా బాధ్యతలు నిర్వహించాల్సిన గవర్నర్లు.. నిబంధనల ప్రకారం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గౌరవప్రదమైన గవర్నర్ పదవిని తమ స్వప్రయోజాల కోసం ఉపయోగించుకుంటున్నారని, కక్షపూరితంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ గవర్నర్లు తమ పదవికి ఉన్న గౌరవాన్ని కోల్పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గవర్నర్లు తమకు పదవి ఇచ్చిన ప్రభుత్వానికి అనకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనేక సంఘటనల్లో నిరూపితమైంది.
పార్టీలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్లు.. ఒకరికి మద్దతు తెలుపుతూ రాజ్యంగబద్దంగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉ న్నప్పుడు కావొచ్చు.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పుడు కావొచ్చు.. గవర్నర్లను తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. గవర్నర్లను అడ్డం పెట్టుకకుని ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణలో గవర్నర్ల వ్యవస్ధను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక తాజాగా పంజాబ్ లో కూడా గవర్నర్ ను బీజేపీ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోుంది. తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేందుకు పంజాబ్ ప్రభుత్వంకు ఇచ్చిన అనుమతిని గవర్నర్ అనూహ్యంగా రద్దు చేయండ ఆ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై పంజాబ్ లో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, అకాలీదశ్ పార్టీలు అనేక ఆరోుపణలు చేస్తున్నాయి. మందుతాగి విమానంలో ఎక్కినందుకు జర్మనీలోని లుఫ్తాన్సా విమానంల ఆయను విమానం నుంచి కిందకు దింపేశారంటూ భగవంత్ మాన్ పై అక్కడి ప్రతిపక్షాలు వమిర్శలు చేస్తున్నాయి.
జర్మనీలోని ఒక వెబ్ సైల్ వచ్చిన వార్తలను ప్రతిపక్షాలు తెరపైకి వచ్చాయి. మందుతాగి విమనాం ఎక్కినందుకు సీఎంను విమానం నుంచి కిందకు దించారని ఆరోపపణలు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను జర్మనీ ప్రభుత్వం కానీ లేదా లుప్తాన్సా సిబ్బంది కూడా ఎక్కడా ఖండించలేదు. చివరి నిమిషంలో విమానాన్ని మార్చడం వల్లనే లుఫ్తాన్సా నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని మర్చాల్సి ఉందని, అందుకే ఢిల్లీకి రావాల్సిన విమానం ఆలస్యమైందని లుఫ్తాన్సా సిబ్బంది తెలిపారు. అక్కడి సిబ్బంది క్లారిటీ ఇచ్చినా సరే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
దీంతో ఈా ఆరోపణలపై పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం సీరియస్ అయింది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ఆయన సిద్దమయ్యారు. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాసపరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకకు ఆప్ ప్రబుత్వం సిద్దమైంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ముందు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో విశ్వాపరీక్షకు ఆప్ ప్రభుత్వం సిద్దమైంది. కానీ చివరి నిమిషంలో గవర్నర్ అనూహ్యం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు నిబంధనలు అగీకరించవని నిపుణులు చెప్పారని చివరి నిమిషంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. దీంతో పంజాబ్ సీఎం ఒక్కసారిా షాక్ కు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో పంజాబ్ లో ఈ అంశం పెద్ద దుమారం రేగే అవకాశముంది. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకని రాజకీయ చేస్తున్నట్లుగానే పంజాబ్ లో కూడా గవర్నర్ తో బీజపీ కొత్త రాజకీయం మొదలుపెట్టిందని అంటున్నారు.