Balakrishna: బాలయ్య విచిత్రమైన మెంటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా తనకి ఇష్టం వచ్చినట్లు చేసి సభా మర్యాదను మంట కలిపేశాడు బాలయ్య. నిజానికి అతను ఒక సెల్ఫ్ సర్టిఫైడ్ సైకో అని వైద్యులు ఎప్పుడో ధ్రువీకరించారు. ఈ సర్టిఫికెట్ ఆయన వద్ద ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆయనకు చికిత్స కూడా అవసరం అని డాక్టర్లు ఎప్పుడో సూచించారు.
అయినా చంద్రబాబు నాయుడు అండ తో ప్రజల్లో తిరుగుతున్నాడు. బాలయ్య మీద ఉన్న ఇష్టంతో అతని అభిమానులు కూడా సర్దుకుపోతుంటారు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ ప్రవర్తనతో మళ్లీ అతని యొక్క ప్రవర్తన వల్ల చిక్కుల్లో పడ్డ సందర్భాలన్నీ మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లాడని అసెంబ్లీలో తొడగొట్టిన బాలయ్య కన్నతండ్రి మీద ఆ బావ చెప్పులు వేయిస్తున్నప్పుడు ఏమైపోయాడు? అప్పుడు ఏమైపోయింది నీ బ్రీడ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడెందుకు తొడ కొట్టలేదు..
ఆనాడు తండ్రికి అండగా నిలబడి ఉంటే వ్యక్తిత్వంలో మరో స్థాయిలో నిలబడి ఉండేవారు బాలయ్య. తండ్రి కన్నీళ్ళకు కారణమైన బావకి జేజేలు కొట్టిన బాలయ్య ఈరోజు బావ సంతోషం కోసం అసెంబ్లీలోనే తొడ కొడుతున్నాడు. నిజంగా ఇది నందమూరి తనయుడుగా సిగ్గుపడవలసిన విషయం. అంతేకాకుండా తండ్రికి బావ వెన్నుపోటు పొడవడానికి సమర్థిస్తూ అన్ స్టాపబుల్ ఎపిసోడ్లో సమర్థించుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చింది.
అసలు తండ్రిని కాదని బావ భజన చేస్తున్న బాలకృష్ణకి అసలు ఆ తండ్రి లేకపోతే చంద్రబాబు ఎక్కడ నుంచి వచ్చాడు?అసలు బాలయ్య ఎక్కడ ఉండేవాడు. నీవే గనక నిజమైన ఎన్టీఆర్ బిడ్డవైతే తెదేపా ని ఇప్పటికైనా చేతిలోకి తీసుకో. ఎన్టీఆర్ అభిమానులు తొడ కొట్టి మీసాలు తిప్పేలా చెయ్యు అది ఒక రాజకీయ వారసుడి లక్షణం. అప్పుడు చెప్పు నీ బ్లడ్ గురించి బ్రీడ్ గురించి అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్ లో బాలయ్య పై ఫైర్ అవుతున్నారు. వాళ్ల బాధలో కూడా నిజం ఉంది మరి.