Mani Ratnam: బాహుబలిని కాపీ కొట్టిన మణిరత్నం.. కోలీవుడ్ ఇండస్ట్రీ పరువు పోయిందిగా?

Mani Ratnam: తెలుగు ప్రేక్షకులకు ఇటీవలే విడుదలైన తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాగా ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ నటుడు విక్రమ్, కార్తీ, జయం రవి, స్టార్ హీరోయిన్ త్రిష, ఐశ్వర్య రాయ్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా నిన్న అనగా సెప్టెంబర్ 30న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ లకు కోలీవుడ్ మీడియా, ప్రేక్షకులు మరో స్థాయిలో ఉబ్బి పోయారు. బాహుబలి ఆ బొక్కా అన్నట్లు మాట్లాడారు. ఈ సినిమా బాహుబలిని మించి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక దర్శకుడికి తిరుగు లేదని కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను మరో స్థాయిలో హైప్ చేసారు. కాగా ఈ మాటలకు మండిపడిన టాలీవుడ్ ప్రేక్షకులు ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.

కోట్లు కొల్లగొట్టిన బాహుబలి సినిమాకు పొన్నియన్ సెల్వన్ సినిమాకు ఏమైనా పోలిక ఉందా అని దెప్పి పొడిచారు. అయినప్పటికీ కోలీవుడ్ మీడియా ఆ సినిమాను బాహుబలి రేంజ్ లో హైప్ చేసింది. కానీ ప్రస్తుతం థియేటర్లో ఈ సినిమాను చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు మణిరత్నం బాహుబలి ని కాపీ కొట్టాడు అని అంటున్నారు.

ఎందుకంటే కథ నవల నుంచే వచ్చింది కానీ.. ట్రీట్మెంట్ మాత్రం బాహుబలిని పోలి ఉందట. కేవలం కథ విషయంలోనే కాదు క్యారెక్టర్లు కూడా సేమ్ టు సేమ్ అలాగే దించేసారట. ఇక ఫైనల్ ట్విస్ట్ కూడ బాహుబలి మొదటి పార్ట్ ను పోలి ఉందని ఈ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు తెలుపుతున్నారు. అయితే కొందరు ప్రేక్షకులు ఈ సినిమాను మణిరత్నం రాజమౌళి నుంచి కాపీ కొట్టాడా.. లేక రాజమౌళి పొన్నియన్ సెల్వన్ కథను చదివి కాఫీ కొట్టాడా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి జనాలు మాత్రం మణిరత్నం బాహుబలి సినిమాను కాపీ కొట్టాడంటూ ఏకీపారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -