Delhi Corona: ఢిల్లీలో పంజా విసురుతున్న కరోనా..

Delhi Corona: దాదాపుగా మూడేళ్ల నుంచి కరోనా విజృంభణతో ప్రపంచమంతా అతలాకుతలమైంది. పలు దేశాల్లో కుప్పలు కుప్పలుగా శవాలను పాతిపెట్టారు. రెండేళ్లుగా బయటకు రావాలంటేనే జనం జంకేవారు. వ్యాపారాలు, విద్యాసంస్థలు, జనజీవనమంతా స్తంభించింది. మొదటి, రెండవ వేవ్‌లోనే వేలాది మంది యువకులు, చిన్నారులు, కరోనా కాటుకు బలయ్యారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత కాస్త అదుపులోకి వచ్చినట్టు వచ్చి మళ్లీ పుంజుకోవడంతో సగం మంది జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది నుంచి ఒకటి రెండు దేశాల్లో తప్ప దాదాపుగా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులకు వచ్చాయి. దీంతో అన్ని రంగాలు ఉద్యోగులు, కార్మికులు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మళ్లీ విజృంభిస్తోంది.

రోజూ 2 వేలకు పైగా కేసులు

ప్రతి రోజూ దాదాపుగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలంతా ఉలిక్కిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో చేరేందుకు బెడ్లు లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఓ వైపు కేసులు పెరుగుతూ మరోవైపు రోజూ సగటున 8-10 మంది కరోనా కాటుకు గురవుతున్నట్లు ప్రభుత్వ లెక‍్కలు చెబుతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సెన ట్వీట్‌ చేశారు. ‘రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూస్తున్నాం..కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని’ పేర్కొన్నారు.

గడిచిన మూడ్రోజుల్లో ఇలా..

సోమవారం తప్ప గడిచిన రెండు వారాల్లో 2వేలకు పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి. సోమవారం 1227 కేసులు నమోదవ్వగా 8 మంది చనిపోయినట్లు అంతకు ముందు ఆదివారం 2162 మందికి పాజిటివ్‌ రాగా 5 మంది మృత్యువాత పడ్డారు. శనివారం 2031 మందికి కరోనా సోకగా 9 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. కరోనాను కట్టడి చేయాలంటే అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు ఆదేశిస్తున్నారు.అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతబడుతాయోనని ఢిల్లీవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -