Cricket: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన అక్షర్.. ఎన్నో స్థానంలో ఉన్నాడంటే..!

Cricket: క్రికెట్ లో ఎడమ చేతి ఆటగాళ్లకు ఉండే క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. మిగతా వారితో పోలిస్తే ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ వీరు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. లెఫ్టాంటెడ్ బౌలర్ల బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. వారికి బౌలింగ్ చేయడమూ అంతే కష్టమని చెప్పాలి. యువరాజ్ సింగ్, జయసూర్య, గిల్ క్రిస్ట్, లారా, గంగూలీ, రైనా లాంటి ఎడమ చేతి ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లను ఎంతగా భయపెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో జహీర్ ఖాన్, వసీం అక్రమ్, స్టార్క్ లాంటి బౌలర్లను ఆడటం ఎంత కష్టమో కూడా చూసే ఉంటారు.

 

లెఫ్టార్మ్ సీమర్స్ తోపాటు స్పిన్నర్స్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నారు. అలాంటి ఎడమ చేతి వాటం బౌలరే అక్షర్ పటేల్. గత కొన్నేళ్లుగా అత్యుత్తమంగా రాణిస్తున్న భారత బౌలర్లలో అక్షర్ ఒకడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో అక్షర్ సిద్ధహస్తుడు. లైన్ అండ్ లెంగ్త్ తో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడంలో అతడు ఆరితేరాడు. అందుకే అన్ని ఫార్మాట్లలోనూ అతడు అంత విజయవంతమవుతున్నాడు. బౌలింగ్ తోపాటు అవసరం వచ్చినప్పుడు బ్యాటింగ్ లోనూ దుమ్మురేపుతున్నాడీ ఆల్ రౌండర్.

 

తాజాగా ఐసీసీ ప్రకటించిన ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో అక్షర్ పటేల్ టెస్టుల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. బుధవారం ఐసీసీ వెల్లడించిన బౌలింగ్ జాబితాలో అక్షర్ ఏకంగా 20 స్థానాలు మెరుగై 18వ ర్యాంకులో నిలిచాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో అతడు 5 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే.

 

టాప్–20లో అక్షర్
బంగ్లాతో తొలి టెస్టులో పెర్ఫార్మెన్స్ తో 650 పాయింట్లను అక్షర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టాప్–20 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఇక రెండు ఇన్నింగ్సుల్లోనూ సత్తా చాటి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్న చైనామన్ బౌలర్ కుల్దీప్ సింగ్ 19 స్థానాలు మెరుగై 49వ ర్యాంకు సాధించాడు. బుమ్రా 4, ఆర్.అశ్విన్ 5వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ లో పుజారా పది స్థానాలు మెరుగై 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 26, పంత్ 6, కోహ్లీ 12వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -