Cricket: ఇండియా పై గెలవడంతో ఆ ఆటగాడి జీవితంలో ఎటువంటి మలుపులు చోటుచేసుకున్నాయో తెలుసా?

Cricket: క్రికెట్ అభిమానులకు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కన్నుల పండుగే. అత్యంత నరాలు తెగే ఉత్కంఠత తో పాటు హై వోల్టేజ్ టెన్షన్ తో సాగే ఈ మ్యాచ్ కోసం కోట్లాదిమంది ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇరుదేశాల మధ్య ఉన్న పరస్పర వివాదాల కారణంగా ఎప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన అది ఓ క్రికెట్ మ్యాచ్ లాగా కాకుండా ఓ యుద్ధం లాగా ఇరుపక్షాల ప్రజలు భావిస్తారు.

 

క్రికెట్ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ తలపడుతున్నాయి అంటే రెండు దేశాల ప్రజలు టీవీ ముందు నుంచి కదిలే ప్రసక్తే ఉండదు. గెలిచిన జట్టుకు ప్రశంసలు ఓడిన చెట్టుకు విమర్శలు అందడం ఈ మ్యాచ్లో సర్వసాధారణం.

 

రీసెంట్గా జరిగిన టి20 ప్రపంచ కప్ లో కోహ్లీ సేన సూపర్ ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను విక్టరీ బాట నడిపించారు. అని మొన్న 2021 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భారత్ పై పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021 అక్టోబర్ 24 జరిగిన ఆ మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేయగలిగింది. అయితే అనూహ్యంగా బాబర్ ఆజమ్ (69 ), మహ్మద్ రిజ్వాన్ (79 ) పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి అనూహ్యంగా ఒంటి చేత్తో ఈ మ్యాచ్ ను కైవసం చేసుకున్నారు.

 

పాకిస్తాన్ జట్టులో గత కొద్ది కాలంగా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్ ఒకడు. 2021 వరల్డ్ కప్ సూపర్ ఇన్నింగ్స్ తర్వాత ఇతను పాకిస్తాన్లో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ మ్యాచ్ గెలిచిన తర్వాత అతనికి ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటన గురించి వివరించాడు.

 

మేం భారత్ పై మ్యాచ్ గెలిచినప్పుడు నేను దాన్ని కేవలం ఒక మ్యాచ్ మాత్రమే అనుకున్నాను. చాలా ఈజీగా గెలిచాను కదా అందులో అంత గొప్పేముంది అని భావించాను. కానీ పాకిస్తాన్ కు తిరిగి వెళ్ళాక నాకు అసలు సంగతి అర్థమైంది. నేను ఏ షాపుకు వెళ్ళినా, ఏది కొనబోయిన అక్కడ షాప్ కి సంబంధించిన వాళ్లు నన్ను ప్రత్యేకంగా చూడడమే కాకుండా నా దగ్గర డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కాదు. నేను బలవంతంగా ఇవ్వబోయిన..”మీ దగ్గర మేము డబ్బులు తీసుకోము. ఏది కొన్నా ఇక్కడ మీకు ఫ్రీ. ఇండియా పై మీరు గెలిచారు మాకు అదే చాలు..”అని చెప్పేవారట.

 

అదలా ఉంచితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో తమను ఓడించిన పార్కును ఈసారి టి20 లో భారత్ జట్టు మట్టికరిపించింది. కోహ్లీ డైనమిక్ బ్యాటింగ్ తో భారత్ ను గెలిపించాడు. మొన్నటి వరకు మంచి ఫామ్ లో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ కూడా ఇంగ్లాండ్లో జరుగుతున్న మూడు టెస్ట్ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -