Cricket: డబ్బు వల్ల నేను మారను.. నా ఆటతీరూ మారదు: కామెరాన్ గ్రీన్

Cricket: ఐపీఎల్ పదహారో సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా మూడ్నెళ్లు సమయం ఉంది. అయినప్పటికీ మినీ వేలంతో టోర్నమెంట్ పై ఆసక్తి ఒక రేంజ్ లో పెరిగిపోయింది. వేలంలో స్టార్ ఆటగాళ్లు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్స్ లాంటి ఆటగాళ్లను తీసుకునేందుకు జట్లన్నీ విపరీతంగా పోటీపడ్డాయి.

 

 

విధ్వంసకర బ్యాటింగ్ చేసేవారితోపాటు బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే ఆటగాళ్లను దక్కించుకోవడం మీద ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ తోపాటు ఫీల్డింగ్ తోనూ ప్రభావవంతం చూపే ఆల్ రౌండర్లకూ ఈసారి వేలంలో మంచి డిమాండ్ కనిపించింది. ఆస్ట్రేలియన్ యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు కూడా మినీ వేలంలో రికార్డు ధర దక్కింది.

 

23 ఏళ్ల కామెరాన్ గ్రీన్ ను రూ.17.5 కోట్లకు కొనుక్కుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. ఈ విషయంపై అతడు స్పందించాడు. భారీ ధర పలకడం వల్ల తన ఆట ఎంతమాత్రమూ మారదని గ్రీన్ స్పష్టం చేశాడు. ‘ఇంత భారీ స్థాయిలో ధరను పొందేందుకు నేనేమీ చేయలేదు. నా పేరును వేలంలో కేవలం నమోదు చేసుకున్నానంతే. అనుకోకుండా పెద్ద ధర పలికింది. కానీ దీని వల్ల నేను కానీ.. నా ఆటతీరు కానీ మారవని ఆశిస్తున్నా’ అని గ్రీన్ పేర్కొన్నాడు.

 

మ్యాచ్ రోజు బౌలింగ్ మీదే దృష్టి: గ్రీన్
క్రికెట్ ఆల్ రౌండర్లు సుదీర్ఘకాలం ఆడాలంటే పనిభారాన్ని నిర్వహించుకుంటూ ఉండాలని గ్రీన్ చెప్పాడు. ‘బ్యాటింగ్, బౌలింగ్ లు రెండింటిలోనూ సమంగా రాణించడం ముఖ్యం. అందులో ఏదో ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు విభాగాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుంది’ అని గ్రీన్ వివరించాడు. మ్యాచుకు ముందు రోజు బ్యాటింగ్ పై, మ్యాచ్ రోజు బౌలింగ్ మీద తాను ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తానని గ్రీన్ వివరించాడు. మరి, ఈ ప్లేయర్ ఐపీఎల్లో ఎలా రాణిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -