Cricket: బంగ్లాతో రెండో టెస్టు.. అరుదైన రికార్డులకు చేరువలో అశ్విన్, పుజారా!

Cricket: టీ20లు, వన్డేల్లో పెర్ఫామెన్స్ ఎలా ఉన్నప్పటికీ టెస్టుల్లో మాత్రం టీమిండియా తిరుగులేని ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ ల్లో ఫైనల్ కు చేరలేకపోయిన భారత జట్టు.. అనంతరం న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ ను కోల్పోయింది. అదే విధంగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఓటమి మూటగట్టుకుంది. కానీ ఆ టీమ్ తో జరిగిన తొలి టెస్టులో మాత్రం ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ సత్తా చాటిన మన ప్లేయర్లు.. బంగ్లా పులుల్ని చిత్తు చేశారు.

 

బంగ్లాదేశ్ తో గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో 1–0 ఆధిక్యంలో ఉన్న మన జట్టు.. ఈ మ్యాచులోనూ గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. మీర్ పూర్ లోని బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచులో భారత సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, స్టార్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా అరుదైన మైలురాళ్లను అందుకునేందుకు సిద్ధమయ్యారు.

 

ప్రస్తుతం భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 87 టెస్టుల్లో 2,989 పరుగు చేశాడు. మరో 11 రన్స్ చేస్తే 3 వేల మార్క్ ను అందుకున్న బ్యాటర్ గా అవతరిస్తాడు. టెస్టుల్లో 400కి పైగా వికెట్లు తీసి, 3 వేలకు పైగా పరుగులు చేసిన లెజెండరీ ప్లేయర్లు కపిల్ దేవ్, షేన్ వార్న్, రిచర్డ్ హ్యాడ్లీ, షాన్ పొలాక్ సరసన చేరతాడు. అదే సమయంలో మరో 7 వికెట్లు తీస్తే 450 వికెట్ల క్లబ్ లో జాయిన్ అవుతాడు. అప్పుడు వేగంగా 450 వికెట్ల తీసిన భారత బౌలర్ గానూ.. రెండో అంతర్జాతీయ ఆటగాడిగానూ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అనిల్ కుంబ్లే (93 మ్యాచుల్లో) పేరిట రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే.. ముత్తయ్య మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

 

రెండో టెస్టుకూ రోహిత్ దూరం
తొలి టెస్టులో సెంచరీతో పుజారా ఫామ్ లోకి వచ్చాడు. తన కెరీర్‌‌ లోనే అత్యంత వేగంగా అతడు శతకం మార్కును అందుకుంది ఈ మ్యాచులోనే. ఇక రెండో టెస్టులో 16 రన్స్ చేస్తే కెరీర్ లో 8 వేల పరుగులు చేసిన ఎనిమిదో భారత బ్యాటర్ గా పుజారా అవతరిస్తాడు. గతంలో సచిన్, ద్రవిడ్, గవాస్కర్, లక్ష్మణ్​, సెహ్వాగ్, కోహ్లీ, గంగూలీ మాత్రమే ఈ మార్క్ ను దాటారు. ఇక, వేలికి గాయంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్.. రెండో మ్యాచుకూ అందుబాటులో ఉండడు. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్ మెంట్ తెలియజేసింది. దీంతో ఈ టెస్టుకూ కేఎల్ రాహులే సారథిగా వ్యవహరిస్తాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -