Cricket: డబల్ సెంచరీ సాధించి రికార్డులు నెలకొల్పిన టాప్ ఆటగాళ్లు

Cricket: బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ తన బాట్ తో మెరుపులు మెరిపించి డబల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదవ ఆటగాడిగా అతను రికార్డ్ సృష్టించాడు. వన్డే క్రికెట్లో తొలి డబల్ సెంచరీ సాధించింది ఒక మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ మాజీ ఉమెన్ క్రికెట్ ప్లేయర్ మెలిండా క్లార్క్ 1997లో డబుల్ సెంచరీ సాధించింది. ఆ తరువాత ఆమెను అనుసరిస్తూ ఎందరో క్రికెటర్లు డబల్ సెంచరీ సాధించారు .వాళ్ల గురించి తెలుసుకుందాం.

 

సచిన్ టెండూల్కర్ (భారతదేశం):

క్రికెట్ గాడ్ గా పేరు పొందిన సచిన్ 2010 దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో 200 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలబడి పురుషుల వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.

 

వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం):

ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న వీరేంద్ర సెహ్వా 2011లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 211 పరుగులు చేసి అప్పటివరకు నెలకొని ఉన్న సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.

 

రోహిత్ శర్మ (భారత్):

తనదైన శైలిలో రన్నల వర్షం కురిపించే రోహిత్ శర్మ 2013 ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో 29 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 173 బంతులకు 264 పరుగులు తీసి సరికొత్త చరిత్రను సృష్టించాడు. తిరిగి 2017లో శ్రీలంకపై 208 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఇప్పటివరకు వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు మరియు మూడుసార్లు డబల్ సెంచరీ సాధించిన ఘనత రోహిత్ శర్మ కే దక్కుతుంది.

 

మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్):

2015లో వెస్టిండీస్తో తలపడ్డ ఈ న్యూజిలాండ్ ఓపెనర్ 237 పరుగులు చేసి అజయ్ అన్న నిలబడ్డాడు. డబల్ సెంచరీ చేసిన ఆరో క్రికెటర్ గా రికార్డును కూడా సృష్టించాడు.

 

క్రిస్ గేల్ (వెస్టిండీస్):

ఈ వెస్టిండీస్ ప్లేయర్ 2017 జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో 215 పరుగులు చేసి డబల్ సెంచరీ లిస్టులో ఎంటర్ అయ్యాడు.

 

ఫఖర్ జమాన్ (పాకిస్థాన్):

ఈ పాకిస్థాన్ ఓపెనర్ 2018 లో జింబాబ్వేపై 210 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు

 

ఇషాన్ కిషన్ (భారత్):

బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్ లో 210 పరుగులు చేసిన ఈ టీమిండియా యువ ఓపెనర్ 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి ఇప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డ్ లు బదలు కొట్టాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా అతను సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -