Cricket: టీమిండియాలో అనూహ్య మార్పు!.. కుల్దీప్‌ను తప్పించడంపై విమర్శలు

Cricket: బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో గెలిచిన భారత జట్టు రెండో మ్యాచులో తుది జట్టులో పెద్దగా మార్పులు చేయదని అందరూ భావించారు. మామూలుగా ఎవరైనా గెలిచిన టీమ్ ను యథాతథంగా కొనసాగిస్తారు. అయితే కొన్నిసార్లు పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి ఏవైనా స్వల్ప మార్పులు చేస్తారు. కానీ రెండో టెస్టులో మాత్రం టీమిండియా పెద్ద మార్పే చేసింది. మొదటి టెస్టు గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించింది.

 

ఫస్ట్ టెస్టులో గింగిరాలు తిరిగే స్పిన్ వికెట్ పై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను ఓ ఆటాడుకున్నాడు కుల్దీప్. రెండు ఇన్నింగ్సుల్లో రాణించి జట్టు విజయంలో కీలక భాగస్వామ్యం వహించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ గా నిలిచాయి. అయితే అనూహ్యంగా రెండో మ్యాచులో అతడికి చోటు దక్కలేదు. ఈ చైనామన్ బౌలర్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ను జట్టులోకి తీసుకున్నారు.

 

ఉనాద్కట్ సద్వినియోగం చేసుకునేనా?
పేస్ వికెట్ ఉందని ఉనాద్కట్ ను తీసుకున్నారంటే సరేననుకోవచ్చు. కానీ ఫస్ట్ మ్యాచులో కేవలం ఒకే వికెట్ తీసిన అశ్విన్ ను తొలగించకుండా కుల్దీప్ ను తీసేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇక పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తోపాటు ఉనాద్కట్ కూడా బంగ్లాతో రెండో మ్యాచులో భాగం కానున్నాడు. మరి, పన్నెండేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అతడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

 

రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మొమినుల్ హక్ స్థానంలో మోమినుల్, ఇబాదత్ హొస్సేన్ ప్లేసులో తస్కిన్ అహ్మద్ టీమ్ లోకి వచ్చారు. టాస్ సందర్భంగా భారత తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కుల్దీప్ ను తప్పించడం దురదృష్టకమరన్నాడు. అయితే జయదేవ్ కు చాన్స్ ఇవ్వడానికే ఇలా చేయాల్సి వచ్చిందన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -