Cricket: పొట్టి ఫార్మాట్‌కు విరాట్ బ్రేక్.. రోహిత్, రాహుల్ సంగతేంటి?

Cricket: ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ రెండు టోర్నీల్లో ఒక్కదాంట్లోనూ జట్టు ఫైనల్ కు చేరుకోలేకపోవడంతో అభిమానులు గుర్రుమంటున్నారు. ఆడకపోయినా సీనియర్లను ఎందుకు పక్కన పెట్టడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఓపెనింగ్ లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పక్కనపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కోహ్లీ పైనా ఇదే రకమైన కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

పొట్టి ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ రాణించినప్పటికీ.. ఆ తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ ల్లో మాత్రం అతడు విఫలమయ్యాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆయన పూర్తిగా ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీని తప్పుకోవాలని అంటున్నారు. అయితే కోహ్లీ తనంతట తానే ఈ ట్వంటీ ట్వంటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. టీ20లకు దూరంగా ఉంటూ.. వన్డేలు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండాలని అతడు డిసైడ్ అయినట్లు సమాచారం.

 

కోహ్లీ నిర్ణయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ పదహారో సీజన్ వరకు టీ20 ఫార్మాట్ కు విరాట్ దూరంగా ఉంటాడని ఆయన చెప్పారు. ‘అవును, టీ20లకు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పాడు. వన్డే సిరీస్ లకు మాత్రం అతడు తిరిగొస్తాడు. అయితే టీ20ల నుంచి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నాడా అనేది మాత్రం ఇంకా తెలియదు’ అని ఆ అధికారి తెలిపారు.

 

రిస్క్ చేయాలనుకోవడం లేదు
‘రోహిత్ విషయంలో తొందరపడాలని అనుకోవడం లేదు. అతడు ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తాం. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ రిస్క్ మాత్రం తీసుకోలేం’ అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. ఇక కేఎల్ రాహుల్ ఫామ్ లేమిపై మాత్రం ఆయన స్పందించలేదు. అతడ్ని వచ్చే సిరీసుల్లో ఆడిస్తారా లేదా అనేది ఇంకా తెలియదు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -