Cricket: పంతం నెగ్గించుకున్న వార్నర్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికీ చెక్

Cricket: డేవిడ్ వార్నర్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. డాషింగ్ ఆటతీరుతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నాడీ లెఫ్టాండర్. ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ గా ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. కెప్టెన్సీతోనూ కంగారూలను ముందుండి నడిపించాడు. సన్ రైజర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించి ఔరా అనిపించాడు. చెప్పుకుంటే పోతే అతడి కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అయితే ఓ మచ్చ కూడా ఉంది.

 

2018లో బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ కారణంగా జాతీయ జట్టుతోపాటు క్రికెట్ ఆడకుండా నిషేధానికి కూడా గురయ్యాడు. అయితే మొత్తానికి తిరిగొచ్చిన అతడు పునరాగమనాన్ని ఘనంగా చాటుతూ దూసుకెళ్తున్నాడు. తనకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని బోర్డును పలుమార్లు కోరాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.

 

సొంత బోర్డు నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో వార్నర్ తెగ బాధపడిపోయాడు. ‘మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్ ను వెనక్కి తీసుకుంటున్నా. ఇకపై సారథ్యం విషయాన్ని ఎత్తబోను’ అని క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

 

వార్నర్ వ్యాఖ్యలతో ఆసీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కెప్టెన్సీ కావాలని అడిగిన వార్నర్ కు.. ముందు సరిగ్గా ఆడు లేకపోతే జట్టులో చోటు ఉండదని పరోక్షంగా సవాల్ విసిరింది. దీంతో వార్నర్ తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు.

 

బ్యాటింగ్ తో బదులిచ్చాడు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో కదంతొక్కి సరికొత్త రికార్డులు సృష్టించాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్.. ఏకంగా ద్విశతకాన్ని బాది అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు. తన బ్యాటింగ్ తో ఆసీస్ బోర్డుకు సమాధానం చెప్పాడు. మరి, త్వరలో అతడు ఆసీస్ నయా సారథి అవుతాడేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -