Cricket: క్రికెట్ కోసం డెవాన్ కాన్వే ఏం పోగొట్టుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

Cricket: ఇండియాలో క్రికెట్ ని ఓ ఆట లాగా కాకుండా.. ఓ మతం లాగా చూస్తారనేది అందరికీ తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. మ్యాచ్ ఓడిపోతే తామే ఓడిపోయామనే ఫీలింగ్ లో బ్రతికేస్తుంటారు. క్రికెట్ అంటే కొంతమందికి ఆట లాగా ఉంటుందేమో కానీ చాలామందికి అది ప్రాణం. అలాంటి క్రికెట్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

 

న్యూజిలాండ్ తరఫున తాజాగాబరిలోకి దిగి ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ డెవాన్ కాన్వే. క్రికెట్ కోసం ఇతడు చేసిన త్యాగం గురించి తెలిస్తే.. మరీ ఇలాంటి పిచ్చి కూడా ఉంటుందని అనుకుంటారు. కాన్వే ఓ సౌతాఫ్రికన్ సిటిజన్. 2015 వరకు అతడు ఆ దేశం తరఫునే ఆడే వాడు. కానీ అనుకోని స్థితిలో అతడు న్యూజిలాండ్ కు వలస వెళ్లాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ కు వెళ్లిన డెవాన్ కు క్రికెట్ ఆట ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. న్యూజిలాండ్ లో క్రికెట్ ని కొత్తగా స్టార్ట్ చేయడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. క్లబ్ క్రికెటర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి.. ఎన్నో కౌంటీలలో అద్భుతంగా ఆడి చివరకు టీంలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇలా న్యూజిలాండ్ టీంలోకి రావడానికి డెవాన్ కు ఏకంగా 5 ఏళ్ల కాలం పట్టింది.

సౌతాఫ్రికా నుండి న్యూజిలాండ్ వచ్చి.. న్యూజిలాండ్ క్రికెట్ టీంలో చోటు సంపాదించడనాకి డెవాన్ కాన్వేకు ఐదేళ్ల సమయం పట్టింది. అయితే ఈ సమయంలో అతడు తనకు ఉన్న ఆస్తులను అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. తన ఆస్తులతో పాటు కారును కూడా అమ్మి.. డెవాన్ క్రికెట్ మీద దృష్టి సారించాడు. ఇలా క్రికెట్ అంటే ప్రాణమిచ్చే డెవాన్ చివరకు న్యూజిలాండ్ టీంలో చోటు దక్కించుకొని.. మొదటి మ్యాచ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.

Related Articles

ట్రేండింగ్

Nilgiri Constituency: నగరి నియోజకవర్గం రివ్యూ.. రోజాకు ఓటమి తప్పదట.. ఆమెకు ఏడుపే మిగిలిందా?

Nilgiri Constituency ఆంధ్రప్రదేశ్లో సెలబ్రిటీ నియోజకవర్గాలలో నగరి నియోజకవర్గ ఒకటని చెప్పాలి. నియోజకవర్గం నుంచి సినీ నటి రోజా ఎమ్మెల్యేగా గెలపొందారు. 2014 -19 ఎన్నికలలో రోజా నగరి నియోజక వర్గం నుంచి...
- Advertisement -
- Advertisement -