Crime: దారుణం.. 17 ఏళ్ల బాలికపై అలా ప్రవర్తించిన మృగాళ్లు?

Crime: దేశవ్యాప్తంగా ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేధింపులు హత్యలు ఆగడం లేదు. దేశంలో తరచు ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేయడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన ఢిల్లీలో మొహన్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

 

ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ 17 ఏళ్ల బాలికతో పాటు ఆమె చెల్లెలు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తాజాగా జరిగిన ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ శ్వాతి మలివాల్‌ ట్వీట్‌ చేస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఆ వీడియోలో కుమార్తెలు ఒకరు 17, ఒకరు 13 ఏళ్ల వయసు ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి వారిలో 17 ఏళ్ళ అమ్మాయి పై యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. వారు ముఖాలకు మాస్కులు ధరించారు అని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుందని ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు..

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -