Crime: భర్త చెప్పిన వినిపించకుండా అభార్షన్ టాబ్లెట్స్ మింగిన మహిళ.. ఎవరికి?

Crime: సాధారణంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మూర్ఖంగా ఆలోచిస్తూ వారికి తోచిన విధంగా వారే ఏదో వైద్యం చేసుకుంటూ కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక మహిళల హాస్పిటల్ కి వెళ్దాము అని భర్త ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా మూర్ఖంగా ఆలోచించి మాత్రలు వేసుకుంది. చివరికి తన చేతులతోనే ఆ మహిళ తన ప్రాణాలను తీసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈ కామర్స్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రీతి కుష్వాహ అనే మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆమె భర్త దేవ్‌వ్రత్ బెంగళూరులోని మైకో లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు.

 

అయితే ప్రీతి తాజాగా ఇంటి వద్ద నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడంతో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. అప్పటికి ఆమెకు 11 నెలల బాబు ఉండగా అప్పుడే అంత తొందరగా రెండవ సంతానం వద్దనుకుంది ప్రీతి. అప్పుడు తాను అబార్షన్ చేయించుకుంటాను అని ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు అందుకు సరే అని అన్నాడు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తకు మెడికల్ షాప్ దగ్గర నుంచి అబార్షన్ మాత్రలు తీసుకురమ్మని చెప్పగా భర్త వద్దు అని ఆమెను మందలించాడు. డాక్టర్ దగ్గరికి వెళితే మంచిది అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోవద్దు అని ఆమె భర్త ఎంత నచ్చజెప్పినా కూడా ప్రీతి మాత్రం వినిపించుకోలేదు.

 

అలా ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో తన భర్త మాటను కాదని ప్రీతి ఈ స్వయంగా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి మాత్రలు తీసుకొని వచ్చి వేసుకుంది. తర్వాత ఆమె తన భర్తకి ఫోన్ చేసి తన రక్తస్రావం ఎక్కువగా అవుతోందని చెప్పింది. నందు వెంటనే అతడు ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఆమె భర్తకు తాను అబార్షన్ మాత్రలు వేసుకున్నట్టు చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయి వెంటనే ఆసుపత్రికి వెళ్దామని భార్యను బ్రతిమలాడాడు. కాని ఆమె మాత్రం హాస్పిటల్ కి వెళ్లడానికి నిరాకరించడంతోపాటు మొండిగా ప్రవర్తించింది. ఈ కేవలం లోనే కి ప్రీతి తమ్ముడికి ప్రీతి భర్త ఫోన్ చేసి అసలు విషయం చెప్పగా అతను కూడా అక్కడికి వచ్చాడు. ఆమె తమ్ముడు కూడా హాస్పిటల్ కి వెళ్దామని చెప్పిన కూడా ఆమె వినిపించుకోకుండా అలాగే ముందుగా ప్రవర్తించింది. దాంతో అతడు చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. తాజాగా ఆమె పరిస్థితి విషమించడంతో భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ మహిళ చేసిన పిచ్చి పనికి ఆమె ప్రాణాలనే పోగొట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -