Crime: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ అంతలోనే!

Crime: ఈ మధ్యకాలంలో యువత ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎంతలా అంటే కన్న తల్లిదండ్రులను కూడా లెక్కచేయకుండా ప్రేమించిన వారే లోకం అన్నట్లుగా ప్రేమిస్తున్నారు. ఇక కొందరు ఇంట్లో ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటే మరికొందరు వారికి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని బతుకుతున్నారు.

 

అయితే తాజాగా ఓ జంట ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని తెలిసి ఇల్లు వదిలేసి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కానీ అంతలోనే శవాలుగా మారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.. బెంగళూరులో ఓ ప్రాంతంలో నాగేంద్ర, యువతి నివసించేవారు.

 

ఇక వీరి మధ్య పరిచయం పెరగటంతో ప్రేమగా మారింది. ఇక ఆ ప్రేమ ప్రాణం కంటే ఎక్కువగా మారింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. ఇక యువతీ తల్లితండ్రులు కూతురికి పెళ్లి చేయాలని అనుకునే లోపు ఎక్కడ తమ తల్లిదండ్రులు తమని విడదీస్తారో అని భయపడి ఇటీవలే ఇల్లు వదిలి పారిపోయారు. ఆ తర్వాత ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

 

ఇక కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ఇద్దరి ప్రేమికులు చిక్కబాణవార – గొల్లహళి అని ప్రాంతాల మధ్య ఉన్న రైల్వే పట్టాలపై శవాలుగా కనిపించారు. ఇక వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇక విషయం తెలియటంతో ఆ ప్రేమికుల తల్లితండ్రులు వచ్చి వారిని అలాగా చూసి తట్టుకోలేక కన్నీటి శోకంలో మునిగిపోయారు. ఇక పోలీసులు వారి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏంటో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -