Crime News: వైశాలి నిజస్వరూపం ఇదా.. అన్ని రూ.లక్షల డబ్బు తీసుకుందా?

Crime News: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో ఓ యువతిని వంద మంది దాడి చేసి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు సవాల్‌గా తీసుకున్న ఈ కేసును ఆరు గంటల్లో ఛేదించారు. యువతిని సురక్షితంగా కాపాడారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులు 32 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.

 

 

అయితే నవీన్ రెడ్డి తనకు కేసుతో సంబంధం లేదని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేర్కొన్నారు. 58 నిమిషాల పాటు సాగిన కాన్ఫర్మెన్స్ మేజిస్ట్రేట్ ముందు విచారణ జరుపుతోంది. శుక్రవారం రోజు మరోసారి మెజిస్ట్రేట్ ముందు నవీన్ రెడ్డిని పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో ఇరు తరఫుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నవీన్ రెడ్డి తరఫు న్యాయవాది.. ‘వైశాలి.. నవీన్ రెడ్డి దగ్గర నుంచి రూ.5-6 లక్షలు తీసుకుని అతడిని వాడుకుంది.’ అని న్యాయవాది వాదించారు.

 

ఇప్పటికే నవీన్ రెడ్డిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. కస్టడీ కోరుతూ మరోసారి ధర్మాసనం హాజరు పరచగా.. నవీన్ రెడ్డిపై 307 సెక్షన్ వర్తించదని న్యాయవాది వాదించారు. నవీన్ రెడ్డి-వైశాలికి మధ్య ఉన్న పరిచయం, స్నేహం గురించిన విషయాలను వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేయాలని అనుకోలేదని, కేవలం తనతో మాట్లాడాలని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులు వెతుకుతున్నట్లు తెలియడంతో ఆమెను నల్గొండలో విడిచి వెళ్లిపోయినట్లు తెలిపారు. వైశాలి నవీన్ రెడ్డి దగ్గర రూ.5 లక్షలు తీసుకుని వాడుకుందని ఆయన కోర్టులో వెల్లడించారు. అయితే ఇరు వాదనలు విన్న మేజిస్ట్రేట్ డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. కాగా మరో వైపు పోలీసుల అదుపులో తనకు భద్రత లేదని నవీన్ రెడ్డి తెలిపాడు. దీంతో మేజిస్ట్రేట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -