Crime News: ఐఏఎస్ ఆఫీసర్ అని నమ్మించి 12 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి?

Crime News: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో రోజురోజుకి అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి 8వ తరగతి చదివాడు కానీ ఐఏఎస్ ఆఫీసర్ల ఫోజులు కొడుతూ అందరినీ నమ్మించి ఏకంగా 12 మంది మహిళలను మోసం చేశాడు అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన వికాస్ గౌతమ్ అనే ఒక వ్యక్తి ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. అతడు అక్కడే సమీపంలోని ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. అయితే చదివింది కేవలం ఎనిమిదవ తరగతి మాత్రమే. కానీ ఐపీఎస్ అంటూ ఫోజులు కొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు.

 

అలాగే సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి ఒక్క మహిళకు రిక్వెస్ట్ లు పెట్టేవాడు. వాళ్లకు నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ల కనిపించడంతో అతని రిక్వెస్ట్ చేసి అతనితో చాటింగ్ కూడా చేసేవాళ్ళు. అలా ఎంతోమంది అమ్మాయిలు చాటింగ్ చేయగా వారిలో డజన్ మంది అమ్మాయిలను వికాస్ మోసం చేసి లక్షలు గుంజుకున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఒక మహిళతో వికాస్ పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళతో క్లోజ్నెస్ ఏర్పరచుకొని మాటలు కూడా కలిపాడు. ఆ తర్వాత ఒకరోజు అతడు అర్జెంటుగా డబ్బులు కావాలి ఒక 25 వేలు పంపించు అనడంతో ఆ మహిళ డాక్టర్ అతనికి డబ్బులు పంపించింది.

 

తర్వాత ఆ మహిళ డాక్టర్ ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా అతను లేవంటూ సమాధానం ఇచ్చాడు. అలా ఎన్నిసార్లు అడిగినా లేవు అని సమాధానం చెప్పడంతో పాటు ఆమెను చంపేస్తాను అంటూ బెదిరించాడు. ఆ తర్వాత మహిళా డాక్టర్ కు చివరికి అతను ఒక ఐపీఎస్ ముసుగులో ఉన్న మోసగాడు అని తెలిసింది. దీంతో ఆమె అతడు చేసిన మోసాలను బయట పెట్టాలని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయం మొత్తం చెప్పాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -