Crime: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష!

Crime: రోజురోజుకు స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు ఎక్కడ తగ్గటం లేదు. ఎక్కడో ఒకచోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలటం లేరు కామంతో ఉన్న కామందులు. ఇప్పటికి వారికి ఎన్ని శిక్షలు విధించినప్పటికీ కూడా వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

 

అయితే కొన్ని కొన్ని చోట్ల ఇటువంటి అఘాయిత్యాలు జరగటంతో.. ఆ ఊరి పెద్దలు అందరి ముందు శిక్షలు వేస్తూ ఉంటారు. నిజానికి వారికి అటువంటి శిక్షలు సరిపోవు అని చెప్పాలి. అయితే ఓ ఊరిలో మాత్రం అటువంటి అఘాయిత్యానికి పాల్పడిన వాడికి కేవలం ఐదు గుంజీల శిక్షతో సరిపెట్టారు ఊరి పెద్దలు. ఇక ఈ విషయం తెలియటంతో ఈ గ్రామ పెద్దలపై అందరూ విరుచుకుపడుతున్నారు. ఇంతకు అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.

 

బీహార్ లో నవాద గ్రామంలో అరుణ్ పండిట్ అనే కోళ్ల ఫారం నిర్వహిస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి తన పౌల్ట్రీ ఫామ్ కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పటంతో వెంటనే ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని బయలుదేరారు.

 

దీంతో వారి దగ్గరికి నిందితుడు అరుణ్ పండిట్ వచ్చి ఈ విషయాన్ని గ్రామపంచాయతీ పెద్దల ముందు తెలుసుకోవాలి అని అనటంతో ఆ తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేకపోయారు. దీంతో ఆ గ్రామ పెద్దలు విషయం మొత్తం తెలుసుకున్నాక అతనికి ఐదుగుంజీల శిక్ష విధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ పాపపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులతో పాటు ఊరి జనాలు చెప్పినప్పటికీ కూడా.. ఎటువంటి అత్యాచారం జరగలేదు..

 

కానీ ఒంటరిగా చిన్నారిని తీసుకెళ్లడం నేరం అని అందుకే శిక్ష విధిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారని తెలిసింది. ఇక వీరి తీర్పుపై అక్కడున్న వాళ్ళు ఫైర్ అవ్వగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేస్తూ.. ఈ ఘటన చూస్తుంటే న్యాయవ్యవస్థ పై నమ్మకం పోతుంది అంటూ కామెంట్ చేయగా.. వెంటనే ఆ వీడియోకు పోలీసు అధికారులు స్పందించి కేసు నమోదు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -