Crime: యువకుడి నరాలు, గొంతు కోసి దారుణంగా హత్య చేసిన దుండగులు?

Crime: రోజుకి సమాజంలో మానవత్వం మంట తెలిసిపోతోంది. మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ఎదుటి వ్యక్తులను అత్యంత కిరాతకంగా దారుణంగా కొట్టి చంపడం హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. నిత్యం దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగులలోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికీ ఇటువంటి నేరగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. అత్యాచారాలు మానసిక వేధింపులతో పాటు హత్యల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతుంది. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా బ్లేడ్లతో కోసి గొంతు నులిమి కసి తీరా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు.

 

అసలేం జరిగిందంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీకి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు 24 ఏళ్ళ అశోక్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. అశోక్ కుమార్ ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అశోక్ కు అమల అనే యువతితో వివాహం జరిగింది. వారికి రెండు నెలల పాప కూడా ఉంది. ముత్యాలం పాడు క్రాస్ రోడ్ కు చెందిన ప్రేమ్ కుమార్ కి అశోక్ కు మధ్య పరిచయం ఉంది. ప్రేమ్ కి అవసరం అవసరమైనప్పుడల్లా అశోక్ ఆర్థికసాయం చేస్తుండేవాడు. అలా అశోక్ కు ప్రేమ్ కుమార్ రూ.80 వేల వరకు బాకీ పడ్డాడు.

 

ప్రేమ్ కుమార్ చెప్పడంతో మరో వ్యక్తికి కూడా అశోక్ అప్పు ఇచ్చాడు. డబ్బు ఎక్కువ అవడంతో అశోక్ వాళ్ళిద్దరిని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ అశోక్ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. దాంతో అశోక్ పై వాళ్లు కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డబ్బులు ఇస్తామని అశోక్ కి ఒక ప్రదేశానికి రమ్మని చెప్పడంతో అశోక్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు చేరుకున్నాడు. అతడిని పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి కట్టేశారు. అనంతరం దారుణంగా అశోక్ గొంతు, నరాలు, చీలమండ కోసేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి అనగా బయటికి వెళ్లిన అశోక్ తెల్లారినా ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పంచాయతీ సిబ్బంది అశోక్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారంం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అది అశోక్ మృతదేహంగా గుర్తించారు. అశోక్ కుటుంబసభ్యలు ప్రేమ్ కుమార్ ఇంటి పై దాడి చేయడంతో పాటు అతడిని కఠరినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ప్రేమ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు...
- Advertisement -
- Advertisement -