Crime: ప్రేమించిన అమ్మాయి కోసం ప్రిన్సిపల్ చంపేసిన యువకుడు?

Crime: సాధారణంగా ప్రేమికులలో చాలామంది ఎవరైనా తన ప్రియురాలి వైపు కన్నెత్తి చూసినా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన లేదంటే వాళ్ళను ఏడిపించి ప్రయత్నం చేసిన వారిని చంపడానికైనా వెనకాడరు. కొన్ని కొన్ని సార్లు పగ పెంచుకొని వారికి తగిన విధంగా బుద్ధి చెబుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి దారుణమే ఒకటి చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ ప్రియురాలిని వేధించాడు అన్న కారణంతో యువకుడు ఏకంగా ప్రిన్సిపల్ ని దారుణంగా కొట్టి చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తాజాగా ఛత్తీస్ గడ్ లో చోటు చేసుకుంది. ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో ఉపేంద్ర కౌశిక్ అనే ఒక యువకుడు నివాసం ఉంటున్నాడు.

 

ఇతడు స్థానికంగా చదువుకకుంటున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా అతడిని ప్రేమిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి వస్తున్న సమయంలో తన ప్రియురాలిని కాలేజ్ ప్రిన్సిపల్ వేధించినట్టుగా తెలుసుకున్నాడు ఉపేంద్ర. కోపంతో ఊగిపోయిన ఉపేంద్ర ఎలా అయినా ప్రిన్సిపల్ పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. గత కొద్దిరోజులుగా ప్రిన్సిపల్ ని తరచూ ఫాలో అవుతూ వచ్చాడు ఉపేంద్ర. అయితే ఎప్పటినుంచో కాపు కాస్తున్న ఉపేంద్ర ఇటీవలే ప్రిన్సిపల్ ప్రదీప్ ను ఒకచోట పట్టుకున్నాడు. ఇక అంతే ఆ తర్వాత నా ప్రియురాలిని వేధిస్తావా అంటూ ప్రిన్సిపల్ తో గొడవకు దిగాడు.

 

అదే విషయంపై వారిద్దరి మధ్య పెద్ద వివాదం చోటుచేసుకుంది. దాంతో కోపంతో ఊగిపోయిన ఉపేంద్ర తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్సిపల్ ప్రతి పై దాడికి ప్రయత్నించాడు. ఇక కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రిన్సిపల్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రదీప్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టగా ఉపేంద్ర అనేకుడు ప్రిన్సిపాల్ ని హత్య చేసినట్టుగా తేలింది. నిందితుడు ఉపేంద్రను గాలించి వెతికి పట్టుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -