MLC Dance: ఆ విషయంలో ఎమ్మెల్సీపై విమర్శలు.. ఇది న్యాయమేనా?

MLC Dance: మాములుగా తెలుగుదేశం అను కుల మీడియా వ్యవహారం చిత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. వారి సామాజిక బంధాలతో వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా అది బాగానే ఉంటుంది. కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం విమర్శలు గుప్పించడం దాన్ని దెప్పిపొడవడం లాంటివి చేస్తుంటారు. తాజాగా అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఓ ఉత్సవంలో వేదిక మీద డ్యాన్సర్లతో సమానంగా తానూ డ్యాన్స్ చేశారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వల్గారిటీ ఏమీ లేదు. కాస్త హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ వీడియో పై టీడీపీ నేతలు కాస్త వెటకారంగా స్పందించడంతో ఆ కామెంట్స్ పై ఆ నేతలు స్పందిస్తూ పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటూ బాలయ్య చేస్తున్నది ఏమిటో? అంటూ తన వయసులో సగం కన్నా తక్కువ వున్న అమ్మాయిలతో డ్యాన్స్ లు చేయడం లేదా? ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలుగా వుంటూ ఈ గెంతులు ఏమిటి? అసయ్యింగా అని ఎవరూ అనలేదు కదా.

 

బాలకృష్ణ డబ్బులు తీసుకుని గెంతితే కళాపోషణ. ఉత్సవంలో జనాలతో కలిసి కాస్త గెంతులేస్తే అది దిగజారుడు? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నిస్తున్నారు. జనాల్లో వైకాపా ఎమ్మెల్సీని చులకన చేస్తున్నాం అని సంబర పడుతున్నారు కానీ జనం ఇది వరకు లేదు. మీ ఎమ్మెల్యే బాలయ్య సంగతేమిటి? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పట్ల ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తోందని చెప్పవచ్చు.

 

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -