Viral: వీడి ధైర్యం మాములుగా లేదుగా.. మొసలి నోట్లో చెయ్యి!

Viral: సాధారణంగా చాలామంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేకి చేస్తారో లేక తెలియని తనంతో చేస్తారో తెలియదు కానీ వీడియోలు ఫోటోలు కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మూగ జంతువులు అందులోనే భయంకరమైన జంతువులు కనిపించాయి అంతే వాటి దగ్గరికి వెళ్లి సెల్ఫీల వీడియోలు తీయడం లేదంటే ఫోటోలు తీయడం చేసి వాటికీ కోపం తెప్పిస్తూ ఉంటారు. ఈ క్షణంలోనే కొన్ని కొన్ని సార్లు అటువంటి జంతువులకు బలవడం లేదంటే వాటి నుంచి ప్రాణాలతో బయటపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మామూలుగా మొసళ్ల దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంతో ధైర్యం చేయాలి. వాటి దగ్గర ఏ మాత్రం ఏమనిపాటుగా ఉన్నా అవి క్షణాల్లోనే అమాంతం మింగేయడం నీటిలోకి లాక్కెళ్ళడం లేదంటే ప్రాణాలను తీయడం లాంటివి చేస్తూ ఉంటాయి.

కానీ తాజాగా ఒక యువకుడు కూడా అలాంటి తింగరి పనే చేశాడు. నీటి కొలను పక్కన ప్రశాంతంగా పడుకున్న ఒక మొసలి దగ్గరకు వెళ్లి తన టాలెంట్ చూపించాలి అనుకున్నాడు. ఆ యువకుడు పక్కన ఉన్న మరొక వ్యక్తి తన కెమెరాతో వీడియో తీస్తున్నాడు. అయితే ఆ యువకుడి ప్లాన్ ఏంటంటే మొసలి నోట్లో చెయ్యి పెట్టాలి. అది నోటిని మూసేలోపే చేతిని వెనక్కి తీసుకోవాలి. అయితే అది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు కూడా అలాంటి సాహసాన్ని చెయ్యాలి అనుకోరు. కానీ ఆ యువకుడు మాత్రం అలాంటి పనే చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోని షేర్ చేస్తూ నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బ్రో అని క్యాప్షన్ ను రాసుకొచ్చారు. అయితే ఆ వీడియోలో ఆ యువకుడు అనుకున్నవిధంగానే మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు. అప్పుడు వెంటనే ఆ మొసలి చెయ్యి పెట్టగానే లటుక్కున నోరు మూసేసింది. దాంతో చెయ్యి లోపల ఉండిపోయింది. దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కాలేదు. మొసళ్ల పట్టు పట్టింది అంటే శరీరంలో సగభాగం కట్ అవ్వాల్సిందే. ఆ వీడియోలో ఆ కుర్రాడు చెయ్యిని వెనక్కి లాక్కోలేకపోయి పల్టీకొట్టినట్లు చేశాడు. దాంతో మొసలి కూడా పల్టీ కొట్టింది. ఇలా ఇద్దరూ పల్టికొట్టే స్టంట్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. కానీ చెయ్యి నుంచి తీవ్ర రక్తం వచ్చినట్లు వీడియోని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -