Balayya: రోడ్లపై బాలయ్య కటౌట్లు.. గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ?

Balayya: కొత్త ఏడాదిని తెలుగ చలనచిత్ర పరిశ్రమ గ్రాండ్ గా ఆరంభించింది. న్యూ ఇయర్ రోజున ‘ధమాకా’, ‘అవతార్ 2’ సినిమాలు వసూళ్లను దండుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజున ఏకంగా రూ.8 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయడం విశేషం. ఈ మూవీస్ జోరు సంక్రాంతి వరకు ఉండనుంది. అయితే పండక్కి మాత్రం అసలైన మజా ఉండనుంది. రెండు భారీ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి.

 

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లు ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. వీటితోపాటు తమిళ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ సినిమాలు కూడా సంక్రాంతి రేసులోకి దిగుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భీకరమైన పోరు జరగనుంది. చిరు, బాలయ్య సినిమాల మధ్య అసలైన పోటీ జరగనుంది.

 

థియేటర్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేనా..?
‘వారసుడు’, ‘తెగింపు’ సినిమాలు కూడా మంచి వసూళ్లు చేసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు.. అజిత్ మూవీని తెలుగు నాట తానే రిలీజ్ చేయనున్నారు. దీంతో ఎక్కువ థియేటర్లు ఈ రెండు సినిమాలకే దక్కేలా ఉంది. అదే జరిగితే.. చిరు, బాలయ్య అభిమానులు గొడవలకు దిగడం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు స్ట్రయిట్ హీరోలు, అందులోనూ ఇద్దరు బడా స్టార్స్ సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారని చెప్పలేం.

 

ఇదిలాఉంటే.. ‘వీరసింహారెడ్డి’ రిలీజుకు మరో పది రోజులు కూడా లేదు. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో జోరు పెంచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఈనెల 6న ఒంగోలులో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అక్కడి ఏబీఎమ్ కాలేజీలో వేడుక జరగనుంది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంటుకు చేరుకునే ప్రతి మార్గాన్ని బాలయ్య అభిమానులు హోర్డింగ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక ‘వీరసింహారెడ్డి’ నుంచి విడుదలైన ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’, ‘మా బావ మనోభావాలు’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సినిమా ఇంకా ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -