Srireddy Daggubati: దగ్గుబాటి అభిరామ్ పరువు తీసిన శ్రీరెడ్డి.. ఏం చెప్పారంటే?

Srireddy Daggubati: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనగా మారినటువంటి వారిలో దగ్గుబాటి అభిరామ్ ఒకరు. దగ్గుబాటి వారసుడిగా అహింస సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజ గారి దర్శకత్వంలో తెరకెక్కిన అహింస సినిమా ద్వారా ఈయన హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున హీరో అభిరామ్ ను ట్రోల్ చేస్తున్నారు.

సినిమా మొదటి నుంచి చివరి వరకు అభిరామ్ సినిమాలో పరిగెత్తుతూనే ఉన్నారని ఎక్కడా కూడా ఈయన స్థిరంగా నటిస్తూ తన ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.అభిరామ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడానికి ఏమాత్రం పనికిరారని మరికొందరు భావిస్తున్నారు.ఇలా ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మరికొందరు శ్రీరెడ్డి వ్యవహారాన్ని కూడా బయటపెడుతున్నారు.

 

ఈ సినిమా గురించి హీరో అభిరామ్ గురించి నటి శ్రీరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె ఈ సినిమా విడుదలైన తర్వాత ఫేస్ బుక్ ద్వారా వీడియోని షేర్ చేస్తూ హీరో అభిరామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యవహార శైలి గురించి శ్రీ రెడ్డి మాట్లాడేటమే కాకుండా బూతులతో రెచ్చిపోయి తనని ఏకిపారేశారు. ఇక అభిరామ్ నటనకు ఏమాత్రం సరిపోరని, నటన విషయంలో ఆయన నిల్ అంటూ కామెంట్ చేశారు.

 

ఎప్పుడు చూడు అభిరామ్ హీరోయిన్లను గోకడం, వారిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడంతోనే సరిపోతుందని ఇందుకు తప్ప అభిరామ్ మరే దేనికి పనికిరాడు అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా శ్రీ రెడ్డి ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడంతో ఒక్కసారిగా అభిరామ్ పేరు మారుమోగిపోతుంది. ఇక రానా కూడా దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆయన సంపాదించిన పేరు ప్రతిష్టలన్నీ ఒక్క సినిమాతో అభిరాం పోగొట్టాడు అంటూ దగ్గుబాటి అభిమానులు సైతం మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -