Dammaiguda: దమ్మాయిగూడ బాలిక మృతి కేసు క్లోజ్.. అసలు ఏం జరిగిందో తెలుసా?

Dammaiguda:: ఇటీవల తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఇందు అనే ఒక 10 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయి శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన కొద్దిరోజులకి శవమై కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు కూతురిని చంపేసి చెరువులో పడేసారని వెంటనే నిందితులను పట్టుకోవాలి అంటూ ధర్నా చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఘటన విషయంలో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆ బాలిక మృతి పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.

 

దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనంతరం స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ బాలిక స్థానికంగా ఉండే చెరువు వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత చెరువులో గాలించగా ఇందు శవమై కనిపించింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు అనుమానించడంతో అసలు నిజాన్ని బయటపెట్టేశారు ఇక అన్ని కోణాల్లో విచారించగా చివరికి ఆ బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిందని పోలీసులు తేల్చారు. దీంతో మొత్తానికి ఈ కేసు మిస్టరీ వీడింది.

అసలేం జరిగిందంటే..జవహర్ నగర్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నరేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ముగ్గురూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు గిన్నెల షాపును నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే స్థానిక స్కూల్లో 8వ తరగతి చదువుతున్న నరేష్ కూతురు ఇందు ఈ నెల 15న స్కూల్ కు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి కాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు స్కూల్ హెడ్మాస్టర్ ని అడగగా వాళ్ళు పాప స్కూల్ కి రాలేదు అని చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి పాప కనిపించడం లేదు అంటే కేసు పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -