Chhattisgarh: మరిదితో కలిసి డాన్స్.. భర్త చేసిన పనికి చివరికి?

Chhattisgarh: సమాజంలోని నిత్యం ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగా మరికొన్ని నవ్వులు తెప్పించే విధంగా ఉంటే మరి కొన్ని సంఘటనలు భయంకరంగా కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న గొడవలు తగాదాలు తీవ్ర స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వరకు కూడా వెళుతున్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు ఒకరు మరణిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కాగా ఈ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కవర్థ పరిధి బంగౌరా గ్రామంలో తిన్హా బైగా అనే వ్యక్తి కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. అయితే ఈ వేడుకల్లో వచ్చిన బంధువులు డ్యాన్సులు చేస్తున్నారు. అదే సమయంలో తిన్హా బైగా భార్య కూడా డ్యాన్స్ చేస్తోంది. మరిది, బంధువులతో కలిసి సంతోషంగా భార్య డ్యాన్స్ చేయడాన్ని చూసిన భర్త తాగిన మైకంలో కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

 

అయితే అది గమనించిన అతడి సోదరులు అడ్డుకునేందుకు వెళ్లగా వారిని హత్య చేశాడు. అదే కత్తితో మరో సోదరుడు, బావపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంధువులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోదరుడు బావ పై కత్తితో దాడి చేసిన అనుసదను నిందితుడు ఏమీ ఎరగన్నట్లు మంచంపై హాయిగా నిద్రపోయాడు. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -