Balayya: స్టార్ హీరో బాలయ్య టీమ్ కు ప్రమాదం.. అలా జరగడంతో?

Balayya: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సంక్రాంతి బరిలో దిగనున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చే నెల జనవరి 12వ తేది నుంచి అభిమానులను ఈ సినిమా ఎంటర్ టైన్ చేయనుంది.

 

ఈ సినిమా షూటింగ్ ని బాలయ్య ఇప్పటికే పూర్తి చేశాడు. ఆ తర్వాత తన మరో సినిమాపై కసరత్తులు మొదలు పెట్టాడు. #NBK108 పేరుతో మరో సినిమాను బాలయ్య చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బాలయ్య పాల్గొంటున్నారు. తాజాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

 

అయితే ఈ సినిమా టీమ్ కు ప్రమాదం వాటిల్లింది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ ప్రమాదం గురించే చర్చించుకుంటున్నారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాను సంక్రాంతి బరిలో నిలబెట్టిన బాలయ్య, ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ యాక్షన్ కామెడీ ఎంటర్ టైన్ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించి షూటింగ్ ప్రారంభమైంది.

 

ఓ వారం క్రితమే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా మొదలైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు కొందరు ఆర్టిస్టులు వ్యాన్ లో బయల్దేరగా ప్రగతినగర్ చెరువు దగ్గర, వేకువజామున వ్యాన్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గాయపడినవారు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -