Pat Cummins: ఆసీస్ సారథి ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడి కమిన్స్ తల్లి కన్నుమూత

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి పాట్ కమిన్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్ బారీన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మరియా.. శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో వెల్లడించింది. తల్లికి అనారోగ్యం కారణంగా భారత పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిన కమిన్స్ కుటుంబంలో ఈ వార్త తీవ్ర విషాదం నింపింది.

 

క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. ‘మారియా చనిపోవడం చాలా బాధాకరం. క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున కమిన్స్, అతడి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా భారత జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ క్రికెటర్లంతా చేతికి నల్ల రిబ్బన్లు ధరిస్తారు..’అని ట్విటర్ లో ప్రకటించింది.

కమిన్స్ తల్లి మృతికి బీసీసీఐ కూడా సంతాపం తెలిపింది. తన అధికారిక ట్విటర్ ఖాతాలో బీసీసీఐ స్పందిస్తూ… ‘ఈ విషాద సమయంలో కమిన్స్, అతడి కుటుంబసభ్యులకు మా సానుభూతి తెలుపుతున్నాం..’అని ట్వీట్ చేసింది. కాగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో నాలుగు టెస్టులు ఆడేందుకు వచ్చిన కమిన్స్.. నాగ్‌పూర్, ఢిల్లీలలో ఆడి ఆ తర్వాత సిడ్నీకి పయనమయ్యాడు. దీంతో మూడో టెస్టుతో పాటు తాజాగా జరుగుతున్న అహ్మదాబాద్ టెస్టులో కూడా స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

ఆసీస్ దూకుడు..

ఇక అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా కదులుతోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (130 నాటౌట్) తో పాటు కామెరూన్ గ్రీన్ (70 నాటౌట్) లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు ఇప్పటికే 135 పరుగులు జోడించారు. ఇదే జోరు కొనసాగిస్తే తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 500 కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూడో రోజు నుంచి పిచ్ స్పిన్ కు సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్.. ఆసీస్ స్పిన్ త్రయాన్ని ఎలా ఎదుర్కుంటుందనేది ఆసక్తకిరం. గత మూడు టెస్టులలో స్పిన్ పిచ్ లపై వికెట్ల పండుగ చేసుకున్న భారత స్పిన్ త్రయం అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ఈ టెస్టులో ఇప్పటివరకు అంత ప్రభావం చూపలేదు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -