Prabhas: ప్రభాస్ ఆస్తుల విలువ అన్ని రూ.కోట్లా.. ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో..?

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరికేక్కిన బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ఆ సినిమా ద్వారా వన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.

పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత బాలీవుడ్ లో కూడా ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో ఒక్కో సినిమాకి ప్రభాస్ రెమ్యూనరేషన్ పెరగటంతో భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ప్రభాస్ కూడా పెట్టిన ఆస్తుల వివరాల గురించి తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ గా మారకముందు ప్రభాస్ గతంలో ఒక్కో సినిమాకు రూ. 5 – 7 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునేవాడు. కానీ, ‘బాహుబలి‘ సినిమా తర్వాత వచ్చిన గుర్తింపుతో అతడి రేంజ్ మారిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి రూ. 100 – 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇప్పటివరకు ఈ రేంజ్ లో ఏ హీరో కూడా రెమ్యూనరేషన్ అందుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రభాస్ కి రూ. 250 కోట్ల నికర ఆదాయం ఉన్నట్లు సోషల్ మీడియా వర్గాల నుండి సమాచారం. అలాగే రూ. 200 కోట్ల విలువ చేసే ఖరీదైన ఇళ్లతో పాటు 15 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ ఉపయోగించే మిగతా ఖరీదైన వస్తువుల విలువ దాదాపు రూ. 10 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే… ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ సినిమా ప్రభాస్ కి ఫ్లాప్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఇటీవల ఆది పురుష్ సినిమా నుండి టీజర్ కూడా విడుదల అయింది. ఈ టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే కొన్ని బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. రాదే శ్యామ్ సినిమాతో ప్లాట్ అందుకున్న ప్రభాస్ ఈ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -