Devotional: బయటికి వెళ్తున్నారా.. దారిలో ఈ ఐదు దృశ్యాలు కనిపిస్తే చాలు.. పని సక్సెస్?

Devotional: సాధారణంగా చాలామంది సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సెంటిమెంట్లతో పాటు శకునాలను కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని రకాల పక్షులు జంతువులు కొందరు మనుషులు ఎదురు రావడానికి శకునంగా భావిస్తారు. పక్షులు జంతువులు అలాగే మనుషులు కొన్ని రకాల వస్తువులు కనిపించినప్పుడు వెళ్లే పని సరిగా జరగదు అని అనుకుంటూ ఉంటారు. మరి ఒకవేళ మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఐదు రకాల దృశ్యాలు కనిపిస్తే మీరు వెళ్లిన పని సక్సెస్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

అయితే మాములుగా శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శకునాలు, అశుభ శకునాలు ఉంటాయి అంటారు. కాగా అమెరికాలో నల్లపిల్లిని అశుభసూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో శుభసూచకంగా భావిస్తారు. భారతీయ సంస్కృతిలో సాధారణంగా నల్లపిల్లిని, ఎండు కట్టెలు, ఒంటి బ్రాహ్మణుని, విధవరాలిని, తుమ్మును అశుభాలకు సూచనగా నమ్ముతారు. అలాగే ముత్తైదువులను,జంట బ్రాహ్మణులను, ఆవును, పచ్చగడ్డి లాంటివి ఎదురైతే మంచి జరగడంతో పాటు వెళ్లే పని సక్సెస్ అవుతుందని అర్థం. అలాగే ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మము, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లము, మజ్జిగ, పాము, కసపు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల విరబోసుకున్నవాడు, దీర్ఘగోగి మొదలైనవి ఎదురైన చెడు శకునాలుగా భావిస్తారు.

 

అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చావు ఊరేగింపు దృశ్యం కనిపిస్తే మంచిది. అది మీరు చేయబోయే పనిలో విజయాన్ని సూచిస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో శంఖం శబ్దం వినిపిస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. ఏదైనా పనిపై బయటకు వెళ్లినప్పుడు గుడి గంట శబ్దం విన్నట్లయితే అది మీ విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు. అలాగే ఉదయాన్నే బిచ్చగాడు ఇంటి దగ్గరకు వస్తే, అది కూడా శుభ సంకేతంగా భావిస్తారు. బిచ్చగాడికి దానం చేయడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవుకు ఆహారం వెళ్లే పని సక్సెస్ అవుతుంది. అలాగే దారిలో పోయేటప్పుడు ఆవుపేడ కనిపించిన కూడా శుభసూచికం అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -