Devotional: శనివారం ఇలా చేస్తే చాలు.. శనీశ్వరుని అనుగ్రహం లభించినట్టే?

Devotional: సాధారణంగా చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శని దేవుని గుడికి వెళ్లాలి అన్న శనీశ్వరుని పూజించాలి అన్నా భయపడుతూ ఉంటారు. అయితే శని దేవుడు అంటే భయపడే వారు ఎంతమంది ఉన్నారో శని దేవుని భక్తిశ్రద్ధలతో పూజించేవారు కూడా అంతే మంది ఉన్నారు. ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి ఎంతోమంది భక్తిశ్రద్ధలతో శనీశ్వరుని కొలుస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని అనుగ్రహం కావాలి అంటే తప్పకుండా కొన్ని పూజలు చేయాల్సిందే. అనుగ్రహం లభించింది అంటే చాలు కోటీశ్వరులు అయిపోతారు. శని అనుగ్రహం కోసం శనివారం ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మనము మన కర్మ ఫలాన్ని ఎలా తప్పించుకోలేమే కానీ ఏల్నాటి శని ప్రభావాన్ని తప్పించుకోలేము. అందుకోసం కొన్ని పూజా పద్ధతుల వలన శని ప్రభావం నుంచి కాస్త అయిన తప్పించుకోవచ్చు. శనీశ్వర గ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే. విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదిత్య హృదయంతో పాటు సుందరాకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకంతో పాటు శని స్తోత్రం, శని చాలీసా,శని అష్టోత్తర సహస్రనా స్త్రోత్రం చేస్తే శని గ్రహ ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుంది. శనివారం నవగ్రహ ఆలయంలోని శనిదేవుని ఆరాధించడం ఎంతో మంచిది. అదేవిధంగా శనీశ్వరుని ముందు నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించడంతో పాటు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల తప్పక శని దేవుని అనుగ్రహం లభిస్తుంది.

 

పరమ శివుని పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈశ్వరుడు అలాగే హనుమంతుని భక్తిశ్రద్ధలతో పూజించే భక్తుల జోలికి శని దేవుడు అస్సలు రాడు. శనివారం రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించాలి. అదేవిధంగా స్వామి దర్శించుకుని బయటకు వచ్చాక బయట ఉన్న పేద వారికి తోచిన విధంగా దానధర్మాలు చేయాలి. ధన రూపం లేదా వస్తురూపం లేదంటే వస్త్ర రూపంలో కూడా దానం చేయవచ్చు. అయితే శని దేవుని పూజలో మీరు ఉపయోగించిన వస్త్రం ఏదైనా కానీ రెండు మీటర్ల పొడవు ఉండాలి. అదేవిధంగా ఆ వస్త్రం ఎవరికైతే దానం చేస్తున్నారో వారికి వినియోగించుకునేలా ఉండాలి. అప్పుడు మాత్రమే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -