Devotional: ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఈ రెండు వస్తువులు ఇంట్లో ఉండాల్సిందే?

Devotional: సాధారణంగా ఒక మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి అలాగే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అన్నవి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్లు చాలామంది ఈ రెండు సమస్యలన్నీ ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వాస్తు శాస్త్రంలో పలు రకాల పరిష్కారాలు చెప్పబడ్డాయి. మరి అందుకోసం ఎటువంటి పరిహారం పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రీకృష్ణుడు ఎప్పుడూ తన కిరీటంపై నెమలి ఈకను ధరించి ఉంటాడు. దీనితో పాటు, కామధేను ఆవు కూడా కృష్ణుడికి ప్రత్యేక గుర్తింపు. జన్మాష్టమి రోజున వీరిద్దరినీ ఆలయంలో పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

 

ఆవు విగ్రహం ,నెమలి ఈకను మీ పూజగదిలో లేదా మీ కార్యాలయంలో ఉంచడం శ్రేయస్కరం. ఈ రెండూ వస్తువులు మీ చుట్టూ ఉన్నందున, జీవితం మారడానికి ఎక్కువ సమయం పట్టదు. నెమలి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదం. కార్యాలయంలో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే వెంటనే మీ పూజ గదిలో కామదేవుని విగ్రహం నెమలీ ఈకను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ పొందడంతో పాటు వాస్తు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అంతే కాకుండా పలు రకాల వ్యాపార ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు. అదేవిధంగా జాతకంలో రాహు దోషం ఉన్నవారు నెమలి ఈకను ఇంటి పొయ్యిలో పెట్టాలి.

 

ఈ నెమలి ఈకను ప్రత్యేక సమయంలోనే కొనుగోలు చేయాలి. అనగా పండుగ లేదంటే పౌర్ణమి సందర్భంగా మాత్రమే ఈ నెమలి ఈకను కొని తెచ్చుకోవాలి. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే ఇంటి ఆగ్నేయ దిశలో నెమలి ఈకను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడేవారు కామధేను విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సంతోషంతో పాటు మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -