Devotional: ఈ నాలుగు వస్తువులు మర్చిపోయారంటే ఇక అంతే సంగతులు?

Devotional: సాధారణంగా స్త్రీలు ఇరుగుపొరుగు వారిని ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోయినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు ఇప్పించుకొని ఆ తర్వాత వాటినీ కొన్ని కొన్ని సార్లు తిరిగి ఇవ్వడం మర్చిపోతుంటారు. ఇది కొన్ని రకాల వస్తువులను మర్చిపోయిన పర్లేదు కానీ కొన్నింటిని తిరిగి ఇవ్వడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదట. అలా చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు. ఎదుటి వ్యక్తి నుంచి పెంచుకున్న కొన్ని వస్తువులు అలాగే ఉంచుకోవడం వల్ల అదృష్టం కాస్త దురదృష్టం గా కూడా మారవచ్చు. దరిద్రం పట్టవచ్చు. మరి అప్పుగా తీసుకోకూడనివి ఇవ్వకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

సాధారణంగా ఒక వ్యక్తి ఇతరుల గడియారాలను ధరించడం మంచిది కాదు. స్నేహితుడైన బంధువు అయిన ఎదుటి గడియారాలు అన్నవి చెడు సమయాలకు సంబంధించినవి. ఒకవేళ ఎదుటి వ్యక్తికి చెడు నడుస్తుంటే ఆ చెడు సమయం కూడా మీకు వస్తుంది. కాబట్టి గడియారం ఇప్పించుకోవడం ఇవ్వడం లాంటిది చేయకూడదు. అదేవిధంగా చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఎవరికైనా చీపురు ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టే. తద్వారా ఆర్థిక సమస్యలు తరిస్తుతాయి. ధన నష్టం మొదలవుతుంది. డబ్బు నీటిలో ప్రవహించడం ప్రారంభం అవుతుంది. కాబట్టి చీపురును ఎప్పుడు అప్పు ఇప్పించుకోవడం, ఇవ్వడం లాంటివి చేయకూడదు.

 

సాధారణంగా పాఠశాలలో లేదంటే ఏదైనా ఆఫీసు కార్యాలయాల్లో ఎక్కువ మంది ఇతరుల నుంచి పెన్ను అడిగి తీసుకునే అలవాటు ఉంటుంది. తర్వాత వాళ్లు ఇద్దరు మర్చిపోయి వాటిని అలాగే ఉంచుకుంటూ ఉంటారు. గ్రంథాల ప్రకారం కలం ఒక వ్యక్తి మంచి, చెడు పనులను ట్రాక్ చేస్తుంది. మీరు ఒకరి నుండి పెన్ను తీసుకున్నట్లయితే దానిని మీ వద్ద ఉంచుకోకూడదు. వాటిని ఖచ్చితంగా దానిని తిరిగి ఇచ్చేయాలి. మీ నుండి పెన్ను తీసుకున్న వ్యక్తి నుండి తిరిగి పొందండి. ఎందుకంటే కలంతో పాటు మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇతరులు మీ మంచి ,చెడు కర్మల ఫలాలను పొందుతారు. చాలా మంది స్త్రీలు చేసే తప్పు, ఉప్పు అప్పుగా ఇప్పించుకోవడం వాస్తు శాస్త్ర ప్రకారం ఉప్పు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, తప్పుగా తీసుకోకూడదు. ఉప్పు చంద్రుడు శుక్రుడికి సంబంధించినది. కాబట్టి వాటిని అప్పుగా తీసుకోవడం వల్ల రెండు గ్రహాలు బలహీనపడటం ప్రారంభమవుతాయి. క్రమంగా అది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -