Devotional: ఆదివారం ఏ దేవుళ్లకు పూజలు చేయాలి? పండితులు ఏం చెబుతున్నారంటే..?

Devotional: ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిది.. ఎలా పూజ చేయాలని అనేవి హిందూమతంలో చాలా ఉన్నాయి. ఆ రోజు ప్రత్యేకంగా ఆ దేవుళ్లకు పూజలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు. ఏ రోజు ఏ దేవుడికి ప్రత్యేకమైన రోజు అనేది పురోహితులు చెబుతూ ఉంటారు. వీటిని చాలామంది నమ్ముతూ ఉంటారు. మంగళవారం ఆంజనేయస్వామికి, శనివారం వెంకటేశ్వరస్వామికి పూజలు చేస్తే మంచిదంటూ ఇలాంటికి చాలా ఉన్నాయి.

ప్రతి దేవతకు ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించారు. ఆ రోజు ఆ దేవుడిని దర్శించుకుని పూజలు చేయడం వల్ల కోరికలు తీరుతాయని చెబుతూ ఉంటారు. ఇక ఆదివారం దుర్గాదేవిని పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆదివారం దుర్గాదేవికి ప్రత్యేకమైన రోజు అని, ఆ రోజు దుర్గాదేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు అని పండితులు చెబుతున్నారు. సంతోషం, సౌభాగ్యాలు కావాలనుకునేవారు ఆదివారం దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

ఆదివారం ఎరుపు బట్టలు, ఎర్రటి పువ్వులు, ఎరుపు రంగు పండ్లు పూజలో ఉంచి దుర్గాదేవికి పూజలు చేస్తే మంచిదని అంటున్నారు.  ఇలా చేస్తే జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, కోరుకున్న కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. సర్వ మంగళ్ మాగల్యే శివే సర్వర్థ సాధికే అనే మంత్రం జపిస్తూ పూజ చేస్తే మంచిదని చెబుతున్నారు.

అలాగే ఆదివారం ఉదయం స్నానం చేసి సూర్కనమస్కాలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. రాగి పాత్రలో స్వచ్చమైన నీటిని నింపాలని, అందులో ఎర్రటి పువ్వులు వేసి ఓం ఘృణి సూర్యాయ నమ: అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యనమస్కారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆదివారం భైరవుడికి పండ్లు, కొబ్బరి నైవేధ్యంగా సమర్పించి పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.  ఓం కాలభైరవాయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆదివారం భైరవుడికి ప్రత్యేక పూజలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.ఆదివారం ఇవన్నీ చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -