Dhamaka: జగన్ పై సెటైర్లు.. రవితేజ మూవీలో కావాలనే ఇలా చేశారా?

Dhamaka: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో ధమాకా మూవీ రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. క్రాక్ సినిమా విజయవంతమైన తర్వాత వరుస ప్లాప్ లతో డీలా పడ్డ రవితేజ, ఈ సినిమాతో హిట్టు కొట్టారు. ఈ మూవీని చూసినవారు ఒకప్పటి మాస్ కామెడీని రవితేజలో చూశానని అంటున్నారు. అయితే ఈ సినిమా సెకండాఫ్ చాలా బోర్ కొట్టిందని కొందరు అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం వెంకీ, ఆంజనేయులు లాంటి సినిమాల తర్వాత ధమాకా అంటూ మరోసారి కామెడీ కమ్ యాక్షన్ తో రవితేజ మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ధమాకా సినిమాకు అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హైపర్ ఆది చెప్పన ఓ డైలాగు ఇప్పుడు జగన్ మీద వేసిన సెటైర్ గా ప్రచారం అవుతూ ఉంది. సినిమాలో రావు రమేష్ దగ్గర డ్రైవర్ గా హైపర్ ఆది పనిచేస్తూ ఉంటాడు. ఆయనతో కొన్ని సెటైర్స్ వేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రీ ఇంటర్వెల్ లో హీరోని చంపేయమని రౌడీల గ్యాంగ్ లీడర్ అయిన లోడెత్తవా రమణకు రావు రమేష్ పురమాయించి తన ఫోన్ కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో మాటి మాటికి ఫోన్ చేసి వేసారా లేదా వేసారా లేదా అని అడుగుతూ ఉండగా అప్పుడు పక్కనే ఉన్న హైపర్ ఆది “బాబోయ్ అప్పటి నుంచి వేసారా లేదా వేసారా లేదా? ఒకటో తారీకు వచ్చింది నా శాలరీ వేసారా లేదా?” అని డైలాగ్ చెబుతాడు.

ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగుల శాలరీలు ఫస్ట్ తారీఖుకు పడటం లేదని కొంతకాలంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ఈ డైలాగు గురించి చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో దీన్ని హైలెట్ చేస్తూ ప్రచారం కూడా సాగుతోంది. రవితేజ గత సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి సెటైర్స్ లేకపోవటంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో ఈ డైలాగు చెప్పిన హైపర్ ఆది అటు పవన్ కళ్యాణ్ కు, ఇటు మెగా క్యాంప్ కు వీర భక్తుడు అని అందరికీ తెలుసు. రాజకీయంగా వైయస్ జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ పోరాడుతుండగా ఈ క్రమంలో ఈ డైలాగును అతని చేత చెప్పించాడనే టాక్ నడుస్తోంది. అయితే రవితేజ సినిమాలో రావటంతో ఇది రవితేజ ఖాతాలో పడిపోయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -