Dhanush-Aishwarya: విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఐశ్వర్య ధనుష్.. అదే కారణమా?

Dhanush-Aishwarya: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ధనుష్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ విధంగా 2004లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు కలరు.

ఇలా18 సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది జనవరి 17వ తేదీ విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురయ్యారు.అయితే వీరిద్దరిని కలపాలని ఇటు ధనుష్ తండ్రి అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేసిన వీరి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదని తెలుస్తోంది.

ఈ విధంగా విడాకులు తీసుకుని విడిపోబోతున్న ఈ జంట గురించి తాజాగా మరొక వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారని తెలుస్తోంది.అయితే విడిపోవాలనుకున్న ఈ జంట కలుసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికొస్తే గత కొద్ది రోజుల క్రితం వీరి పెద్ద కుమారుడు స్కూల్ ఫంక్షన్ కోసం తల్లిదండ్రులుగా వీరిద్దరూ అటెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే తల్లిదండ్రులకు పిల్లల పట్ల వీరి బాధ్యత ఎంత మేర ఉందో తెలిసి వచ్చిందట.

ఇలా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోతే పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని భావించిన ఈ దంపతులు వారి విడాకులను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం తనకు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్న మనశ్శాంతి మాత్రం లేదని ఆందోళన వ్యక్తం చేయగా కేవలం తన కూతుర్ల భవిష్యత్తు గురించి ఆలోచించి రజనీకాంత్ ఆందోళన చెందుతున్నారని ఐశ్వర్య తన తండ్రి పిల్లల కోసం తన విడాకులను రద్దు చేసుకుంటున్నారని తెలుస్తోంది.త్వరలోనే కోర్టులో విడాకుల కోసం వేసిన పిటీషన్ ను ఇద్దరు వెనక్కి తీసుకొని కలిసిపోయామని గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts