Dhanush-NTR: ఆ సినిమాలో కలిసి నటించనున్న ధనుష్, తారక్?

Dhanush-NTR: దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ పై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సౌత్ ఇండియన్ స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా దర్శకులు తెలుగు తమిళం కలిపి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

 

గతంలో ఈ విధంగా మణిరత్నం తెలుగు తమిళ స్టార్స్ ని కలిపి ఒకే సినిమాలో చూపించాలి అని ప్లాన్ చేసినప్పటికీ అది కుదరలేదు. ఇకపోతే కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా వెట్రిమారన్ గురించి మనందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు వెట్రిమారన్. అయితే వెట్రిమారన్ ఎక్కువగా కల్ట్ కంటెంట్ తో సినిమాలు చేస్తాడనే బ్రాండ్ అతనికి ఉందన్న విషయం మనందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే వెట్రిమారన్ కొద్దీ రోజులుగా క్రితం ఎన్టీఆర్ కి కథ చెప్పాడని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరకి తెలిసిందే.

ఇదిలా ఉంటే ధనుష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సౌత్ ఇండియాలోనే భారీ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కించే ప్రయత్నంలో వెట్రిమారన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఇద్దరు స్టోరీలు ఓకే చెప్పారని పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వినిపించాయి. అనంతరం ఎన్టీఆర్ తన 32వ సినిమాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ తో కలిసి చేయబోయే అవకాశం ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా తమిళ్ ప్రొడ్యూసర్ ఎలర్డ్ కుమార్ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -