Gambhir: ధోని కూడా వరల్డ్ కప్స్‌లో ఫెయిలయ్యాడు.. రోహిత్‌పై నమ్మకం ఉంది: గంభీర్

Gambhir: టీమిండియా సారధి, ఓపెనర్ రోహిత్ శర్మ ఈమధ్య సరిగ్గా రాణించడం లేదు. అదే సమయంలో సారధిగానూ అతడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో జట్టును గెలిపిస్తున్నప్పటికీ.. ఆసియా కప్ తోపాటు వరల్డ్ కప్ లాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు కప్పు అందించడంలో రోహిత్ ఫెయిలవతున్నాడు. అదే సమయంలో అతడి ఫామ్ బెడద కూడా ఇబ్బంది పెడుతోంది.

 

 

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆడిన తీరు అందర్నీ నిరాశపర్చింది. పూర్తి డిఫెన్సివ్ స్ట్రాటజీతో వికెట్లను కాపాడుకోవడం పైనే దృష్టి పెట్టడంతో భారత భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ సిరీస్ మొత్తంలో హిట్ మ్యాన్ ఆటతీరు అలాగే సాగింది. కెప్టెన్ గానూ వ్యూహాలను అమలు చేయడంలో అతడు ఫెయిలయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు ఓ సీనియర్ క్రికెటర్ నుంచి మద్దతు దక్కింది.

 

ఒక్కో సిరీస్‌కు ఒక్కో కెప్టెనా?
రోహిత్ కు గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఒక్క ప్రపంచ కప్ లో విఫలమైనంత మాత్రాన రోహిత్ సారథ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదన్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా నాలుగు ప్రపంచ కప్ టోర్నీల్లో విఫలమయ్యాడని గంభీర్ గుర్తు చేశాడు. ప్లేయర్లను తరచూ మార్చడం, సిరీస్ కు ఒక కెప్టెన్ ను నియమించడమే టీమిండియా ఓటములకు కారణమన్నాడు.

 

శ్రీలంకతో టీ20 సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ ను చేయడం మీదా గంభీర్ స్పందించాడు. ‘ఒక్క ప్రపంచ కప్ లో విఫలమైనంత మాత్రాన రోహిత్ శర్మ ప్రతిభను తక్కువ చేయడానికి లేదు. అతడికి కెప్టెన్సీ స్కిల్స్ లేకపోతే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అన్ని టైటిళ్లు ఎలా గెలిచింది? మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనూ టీమిండియా నాలుగు వరల్డ్ కప్స్ లో టైటిల్స్ సాధించలేకపోయింది. అంతమాత్రాన ధోని కెప్టెన్సీని తప్పుబట్టగలమా? రోహిత్ సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని గంభీర్ వివరించాడు.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -