Dhoni Fail: ధోనీ ఫెయిల్.. సెహ్వాగ్ సెన్సేషనల్ కామెంట్స్

Dhoni Fail: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ తెప్పించాడు. ఇప్పటికీ చెన్నై తరపున ఆడుతూ తన సత్తా చూపిస్తున్నాడు. గత ఐపీఎల్ లో చెన్నై పేలవ ప్రదర్శన కనబర్చింది. అయితే ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కూడా చెన్నై తేలిపోయింది. తొలి మ్యాచ్ లోనే ఓటమి మూటకట్టుకుని నిరాశకు గురైంది.

ఈ క్రమంలో సీఎస్‌కే ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడని, ధోనీ పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నాడు. ధోనీ కెప్టెన్సీ పేలవంగా సాగిందని, ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ దేశ్ పాండేను ధోనీ ఉపయోగించిన విధానం సరిగ్గా లేదన్నాడు. దేశపాండేతో కాకుండా మెయిన్ అలీతో ధోనీ ఒక ఓవర్ వేయించి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయడ్డాడు.

 

ధోనీ తరుచుగా ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కుచిచేతి వాటం బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్ తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాల్సిందన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పాత బంతితో బౌలింగ్ వేసే తుషార్ దేశ్ పాండేతో ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే బౌలింగ్ వేయించడం ఆశ్చర్య కలిగించిందని అన్నాడు.

 

ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా దేశ్ పాండే ఎంపిక తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్, బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ కూడా వ్యాఖ్యానించాడు. గుజరాత్ టైటాన్స్ తో చెన్నై ఆడిన మ్యాచ్ లో గుజరాత్ గెలుపొందింది. చెన్నై బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో ఎవరూ రాణించలేకపోయారు

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -